టైటానిక్ భామకు మరో పురస్కారం??
టైటానికి సినిమాలో నటించిన నాయిక కేట్ విస్లెట్ గురించి పరిచయం చెయ్యనవసరం లేదు. టైటానిక్ సినిమాలో రోజ్ పాత్రలో ఇట్టే ఇమిడిపోయి ఆమె చేసిన నటనకు ప్రేక్షకులు ముగ్ధులయిపోయారు. దాంతో ఆమె ఎంతో మందికి కలల రాణిగా మారిపోయింది. టైటానిక్ సినిమాలో ఆమె నటనాప్రతిభ ఆమెకు ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయ్యేలా చేసింది. కానీ తృటిలో అవార్డు మిస్ అయినప్పటికీ, ఈ ఏడాది ప్రకటించిన ఆస్కార్ అవార్డుల్లో 'ది రీడర్' సినిమాలో నటనకు ఆమె ఉత్తమనటిగా ఎన్నికయింది.
తాజా ఈ సినిమా ఆమెకు ఇంకో ప్రతిష్టాత్మక అవార్డును తెచ్చిపెట్టనుందా?? అవుననే అంటున్నారు పరిశీలకులు. ప్రతిష్టాత్మక యూరోపియన్ ఫిల్మ్ అవార్డ్స్ (EFA) లో కేట్ 'ది రీడర్' సినిమాలో నటనకు గాను ఉత్తమ నటి విభాగంలోని అవార్డుకు నామినేట్ అయింది. కాగా ఈమెకు 'ఫిష్ ట్యాంక్' సినిమాలో నటించిన నూతన నటి క్యాటీ జార్విస్ నుండీ గట్టి పోటీ ఎదురవుతోందట. ఇక ఈ ఏటి ఆస్కార్ అవార్డులలో అవార్డులు పంట పండించిన స్లమ్ డాగ్ మిలియనీర్ ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు లతో కలిపి మొత్తం ఐదు విభాగాల్లో అవార్డుకు నామినేట్ అయింది. ఈ అవార్డులు ఫలితాలు డిసెంబరు నెలలో జర్మనీలో జరిగే వేడుకలో ప్రకటిస్తారు.


Click it and Unblock the Notifications











