Don't Miss!
- News క్రైస్తవ పాఠశాలపై హిందువుల దాడి
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
మనిషి పాత్రలో నటించాలంటున్న స్టార్ హీరోయిన్
టైటానిక్ సినిమా ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకోవడమే కాకుండా ఆస్కార్ అవార్డుని పొందిన స్టార్ హీరోయిన్ కేట్ విన్స్లెట్ రాబోయే కాలంలో 'మనిషి' పాత్రను పోషించాలనున్నట్లు తన మనసులోని మాటను బయట పెట్టారు. మనిషి పాత్రని ఓ ఛాలెంజ్‌గా తీసుకోని భవిష్యత్తులో నటించడానికి అన్ని రకాలుగా తాను సిద్దంగా ఉన్నట్లు తెలియజేశారు.
36 సంవత్సరాల వయసు కలిగిన కేట్ విన్స్లెట్ ఈ విషయాన్ని ఇటీవల టివి మిని సిరిస్ 'మిల్డ్రెడ్ పియర్స్'లో నటించిన నటనకు గాను గోల్డెన్ గ్లోబ్ని పొందిన సందర్బంలో తెలిపారు. ఈ సందర్బంలో కేట్ విన్సెట్ మాట్లాడుతూ నా జీవితంలో ఏదో ఒకరోజు మగ వ్యక్తి పాత్రలో నటించాలని ఉంది. ఈ పాత్ర నాకు కొత్తగా ఉంటుంది. ఐతే ఏ విధమైన మనిషి పాత్రను పోషిస్తానో ఇప్పుడే చెప్పడం కష్టం.
సాధారణంగా ఆడవారు వారికి సంబంధించిన ఎటువంటి పాత్రలైన అలవోకగా పోషిస్తారు కానీ, మగ మనిషి పాత్రలో నటించడం నిజంగా ఓ ఛాలెంజ్ అని అన్నారు.