టైటానిక్ తారకు అరుదైన గౌరవం..!!
పన్నెండేళ్ల క్రితం వచ్చిన అద్భుత ప్రేమకథా చిత్రం టైటానికి సినిమా ద్వారా పరిచయం అయిన తార కేట్ విన్స్లెట్. టైటానికి చిత్రంలో నటనకు గాను ఆస్కార్ అవార్డుకు నామినేషన్ దక్కించుకున్నా ఆమెకు నిరాశ ఎదురైంది. కానీ గత ఏడాది ఆమె నటించిన ది రీడర్ సినిమాలో ప్రదర్శించిన నటనకు గాను ఆస్కార్ కు నామినేట్ అయి, అవార్డును సాధించింది.
గత ఏడాది ఉత్తమ నటిగా ఆస్కార్ అవార్డు అందుకోవడానికి కార్యక్రమానికి వచ్చిన ఆమె ఈ ఏడాది జరిగే కార్యక్రమానికి అవార్డు విజేతలకు అవార్డును అందించేందుకు రానుంది. అతి కొద్దిమందికి లభించే ఈ అరుదైన గౌరవాన్ని ఆమె సొంతం చేసుకున్నారు. అయితే మరోసారి ఈ శృంగార తార ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో రెడ్ కార్పెట్ మీద తలుక్కున మెరవనుందన్నమాట.
More from Filmibeat
కేట్ విన్స్లెట్ టైటానిక్ ఆస్కార్ అవార్డు ది రీడర్ స్లమ్ డాగ్ మిలియనీర్ యూరోపియన్ ఫిల్మ్ అవార్డులు హాలీవుడ్ kate winslet titanic oscar awards the reader slumdog millionaire hollywood


Click it and Unblock the Notifications











