తల్లి కాబోతున్న ప్రముఖ నటుడి కుమార్తె.. లాక్‌డౌన్‌లో ఊహించని అంటూ..
ప్రముఖ నటుడు ఆర్నాల్డ్ స్క్వార్జ్‌నెగర్ కూతురు, సెలబ్రిటీ, రచయిత క్యాథరీన్ స్క్వార్జ్‌నెగర్ త్వరలోనే ఓ పండండి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. తన ప్రెగ్నెన్సీ గురించి ఫాదర్స్ డే రోజున పంచుకోవడం విశేషంగా మారింది. గతేడాది నటుడు క్రిస్ ప్రాట్‌తో క్యాథరీన్ వివాహం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం క్యారంటైన్ లైఫ్‌ను భర్తతో ఎంజాయ్ చేస్తున్న క్యాథరీన్ ఇటీవల మీడియాతో తన అనుభవాలను పంచుకొన్నారు. ఆమె చెప్పిన విషయాలు ఏమిటంటే..

ప్రెగ్నెన్సీపై క్లారిటీ ఇస్తూ..
తన ప్రెగ్నెన్సీ గురించి క్యాథరీన్ మాట్లాడుతూ.. నేను గర్బవతిని అనే విషయం తెలిసినప్పటి నుంచి శారీరక, మానసిక పరమైన జాగ్రత్తలు తీసుకొంటున్నాను. నాన్న అర్నాల్డ్‌తో, సోదరి క్రిస్టినాతో ప్రతీ రోజు వాకింగ్ చేస్తున్నాను. లాక్‌డౌన్ సమయంలో మాస్కులు విధిగా ధరిస్తూ లాస్ ఎంజెలెస్‌లోని మా నివాసంలో ప్రతీ రోజు వర్కవుట్లు చేస్తూ నాన్నతో కొత్త అనుభూతులు పంచుకొంటున్నాను అని క్యాథరీన్ పేర్కొన్నారు.

నాన్న, చెల్లితో ఎంజాయ్ చేస్తూ..
నాన్న, చెల్లి సైకిల్ రైడ్ చేస్తుంటే వారిని పట్టుకొనేందుకు పరుగులు పెడుతున్నాను. వారితో కలిసి జోక్స్ షేర్ చేసుకొంటూ నవ్వుల్లో మునిగిపోతున్నాం. సాధ్యమైనంత వరకు శారీరానికి ఉత్తేజం కలిగించే ఎక్సర్‌సైజులు చేస్తున్నాను. కడుపులో బిడ్డ పెరుగుదలకు తోడ్పాడే వర్కువుట్లు వైద్యుల పర్యవేక్షణలో చేస్తున్నాను అని క్యాథరీన్ చెప్పారు. ప్రస్తుతం తండ్రి అర్నాల్డ్‌తో కలిసి సైకిల్ రేస్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కడపులో పెరిగే బిడ్డ గురించే
మాతృత్వపు అనుభవాన్ని పొందేందుకు నా సన్నిహితులు, స్నేహితులు, కుటుంబ సభ్యులతో మమేకమై ఉంటున్నాను. వారితో ఆహ్లాదకరమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నాను. ఇప్పుడంతా నా కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించే ఆలోచనలు. ఇలాంటి సమయంలో మాకు లాక్‌డౌన్ సమయం చాలా కలిసి వచ్చింది. నా భర్త, కుటుంబ సభ్యులంతా నాతోనే సమయాన్ని గడుపుతున్నారు అని క్యాథరీన్ పేర్కొన్నారు.

ఇంటిని, లైబర్రీని నీటుగా
నా ఇంటిని నీటుగా సర్దుకొంటున్నాను. పుస్తకాలు, వంటగదిని చక్కగా అలంకరించాను. ప్రతీ వస్తువును శుభ్రంగా ఉంచేసి ఇంటిని ఆహ్లాదంగా మార్చేశాను. ఎక్కువగా కొత్తరకమైన వంటలు చేస్తూ సమయాన్ని గడుపుతున్నాను. వంట పనుల్లో నాకు నా భర్త క్రిస్ ప్రాట్ సహాయం చేస్తున్నారు అని క్యాథరీన్ అర్నాల్డ్ స్వ్వార్జ్‌నెగర్ తెలిపారు.
Recommended Video

2018లో డేటింగ్.. 2019లో పెళ్లి
ఇక క్యాథరీన్ అర్నాల్డ్ స్వ్వార్జ్‌నెగర్ వ్యక్తిగత విషయానికి వస్తే.. 2018లో క్రిస్ ప్రాట్‌తో డేటింగ్ మొదలుపెట్టిన ఈ యువ రచయితకు జనవరి 2019లోనే నిశ్చితార్థం, పెళ్లి జరిగింది. అప్పటి నుంచి ప్రతీ రోజును ఉత్తేజంగా గడుపుతున్నారు. ఇక అవెంజర్స్‌లో నటించిన క్రిస్ ప్యాట్ విషయానికి వస్తే.. ఆయన రెండోసారి తండ్రి కాబోతున్నారు. గతంలో మాజీ భార్య అన్నా ఫారిస్‌తో కలిగిన జాక్ అనే ఏడేళ్ల కుమారుడు ఉన్నారు.


Click it and Unblock the Notifications











