తిరిగి కలసిపోయి...కలసినడుద్దాం రా...!!
ప్రముఖ మాజీ మోడల్ క్యాటీ ప్రైజ్ తను 'అయామ్ సెలబ్రిటీ...' రియాలీటీ షో నుండీ బయటకు రాగానే తన బాయ్ ఫ్రెండ్ అలెక్స్ తో తను అక పై కలసి వుండటం కల్ల అని బాంబు పేల్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తన మాజీ భర్త పీటర్ ఆండ్రీకి ఫోన్ చేసిన క్యాటీ అతనితో ఎంతో ఉద్వేగంగా మాట్లాడిందట. తనని తిరిగి నీ జీవితంలోకి ఆహ్వానించమని వేడుకొందని విశ్వసనీయ వర్గాల సమాచారం. రెయిడ్ తో కలసివుండటం తప్పని, అందుకు తనని క్షమించమని, నీ నుండీ విడిపోయాకా తనేమి చేస్తున్నానో తెలియని అయోమయంలో ఏవేవో చేసానని అందుకు తనని పెద్దమనసుతో క్షమించి తిరిగి తనని చేరదీయాలని అడిగినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇంతకు మునుపు 'అయామ్ సెలబ్రిటీ...' రియాలీటీ షో లో పాల్గొన్న క్యాటీ, పీటర్ ప్రేమించి పెళ్ళి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆపై అభిప్రాయభేదాలతో విడిపోయాకా పీటర్ పై దుమ్మెత్తి పోసిన క్యాటీ, ఇప్పుడిలా ఫోన్ చేసి అడిగడం పీటర్ ను ఆశ్చర్యానికి గురిచేసిందట.
ఇదిలా వుండగా తనకు రెయిడ్ నుండీ విడిపోయాకా ఎంతో సంతోషంగా వుందని, తనకి ఎలాంటి బంధాలు అక్కర్లేదని...ఇలాగే సంతోషంగా వున్నానని క్యాటీ తన ట్విట్టర్ లో వెళ్ళడించింది.


Click it and Unblock the Notifications











