రాబోయే తరానికి నా కూతురు పెద్ద హీరోయిన్ అవుతుంది
టామ్ క్రూయిజ్, క్యాటీ హాల్మస్‌ల గారాల ముద్దు బిడ్డ సూరి క్రూయిజ్. ఇటీవల ఇన్ స్టయిల్ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్యూలో క్యాటీ హాల్మస్ మాట్లాడుతూ సూరి క్రూయిజ్ మంచి అద్లెట్, సింగర్, డాన్సర్. నాకు తెలిసి రాబోయే రోజుల్లో హాలీవుడ్‌కి ఓ మంచి హీరోయిన్ అయ్యే అవకాశాలు సూరి క్రూయిజ్‌కి ఉన్నాయని తన ఐదు సంవత్సరాలు కూతురు గురించి చాలా గొప్పగా వెల్లడించింది.
ఇప్పటి నుండే సూరి క్రూయిజ్ తన స్టయిల్స్‌ని ఏవిధంగా సెలెక్ట్ చేసుకుంటుందనే విషయాన్ని కూడా క్లుఫ్తంగా వెల్లడించింది. తను సెలెక్ట్ చేసుకునే హైపీల్స్, లిప్ స్టిక్ తన డ్రస్సులకు
ఎలాంటివి ఐతే కరెక్టుగా సరిపోతాయో అలాంటి వాటినే ఎన్నుకుంటుందని తన ముద్దులు కూతురుని తెగ పోగిడేసింది.
ఇంకా చెప్పాలంటే నేను అసలు సూరి డ్రస్ గురించి శ్రద్ద తీసుకోను. తనంతట తానే తన డ్రస్తుని వేసుకుంటుంది. నేను కేవలం తనకు బట్టలు మాత్రమే కొంటాను. తన బట్టల విషయంలో తనే నాకు సహాయం చేస్తుంది. తను ఏది సెలెక్ట్ చేసినా అది ఖచ్చితంగా మంచిదే అయిఉంటుందని తన గారాల బిడ్డ గురించి మ్యాగజైన్‌కి వెల్లిడించింది.


Click it and Unblock the Notifications











