విడాకుల కేసు: వెడ్డింగ్ రింగ్ లేకుండా తొలిసారి పబ్లిక్‌లోకి
న్యూయార్క్, జులై 3: క్యాటి హాల్మస్ గత వారం తన భర్త టామ్ క్రూయిజ్ నుండి విడాకులు కావాలంటూ కోర్టుని ఆశ్రయించిన తర్వాత తొలిసారి తాను ప్రస్తుతం నటిస్తున్న సినిమా షూటింగ్‌లో కనిపించారు. 33 సంవత్సరాల వయసు కలిగిన క్యాటి హాల్మస్ చాలా సంతోషంగా కనిపించారు. 2001లో టామ్ క్రూయిజ్ నుండి అతని మాజీ భార్య, హాలీవుడ్ స్టార్ హీరోయిన్ నికోల్ కిడ్‌మన్ టామ్ క్రూయిజ్ నుండి విడాకులు తీసుకునేటప్పుడు ఎటువంటి ఆనందాన్ని కనబర్చారో సరిగ్గా ఇప్పుడు అదే ఆనందాన్ని హాల్మస్ ముఖంలో చూశామంటున్నారు.
బ్లాక్ షర్ట్‌తో పాటు తక్కువ మేకప్ వేసుకోని దర్శనమిచ్చిన క్యాటి హాల్మస్ చేతికి మాత్రం వెడ్డింగ్ రింగుని ధరించకుండా వచ్చి అక్కడున్న అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. టామ్ క్రూయిజ్‌ని వివాహం చేసుకోని ఐదు సంవత్సరాల పూర్తయింది. ఈ ఐదు సంవత్సరాలలో ఏరోజు కూడా క్యాటీ హాల్మస్ తన చేతికున్న ఐదు క్యారెట్ల బంగారపు ఎంగేజ్ మెంట్ రింగ్‌ను తీసింది లేదు. తన భర్త నుండి విడాకులు కావాలని కేసు పైల్ చేసిన తర్వాత తొలి సారి క్యాటి హాల్మస్ రింగ్ లేకుండా పబ్లిక్‌లో కనిపించారు.
2006వ సంవత్సరంలో క్యాట్ హాల్మస్‌ను టామ్ క్రూయిజ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. క్యాట్ హాల్మస్‌కు ఇదే మొదటి వివాహం కాగా, టామ్ క్రూయజి్‌కు మూడవ వివాహం. టామా క్రూయిజ్ గతంలో హాలీవుడ్ స్టార్ హీరోయిన్లు మిమి రోజెర్స్, నికోల్ కిడ్‌మన్‌లను వివాహం చేసుకున్నాడు. నికోల్ కిడ్ మన్‌లతో కలిసి ఉన్నప్పుడు టామ్ క్రూయిజ్ ఇసాబెల్లా జానే, కానర్ ఆంటోనీ ఇద్దరు పిల్లలను దత్తతు తీసుకున్నాడు. దీంతో టామ్ క్రూయిజ్‌కు మొత్తం ముగ్గురు పిల్లలు.
ఇక టామ్ క్రూయిజ్ పేరున చాలా వరకు ఎస్టేట్స్ ఉన్నాయి. వీరిద్దరి విడాకుల నేపద్యంలో న్యూయార్క్‌లో ఉన్న అతి పెద్ద విడాకుల న్యాయవాది విక్కీ జైగ్లర్ మాట్లాడుతూ క్యాట్ హాల్మస్, టామ్ క్రూయిజ్‌ల కూతురైన సూరి క్రూయిజ్ లైఫ్ స్టయిల్ నిర్వహణ(కార్లు, కార్యకలాపాలు, బట్టలు, జుట్టు అపాయింట్మెంట్ల)కు గాను పెద్ద మొత్తంలో అవసరం అవుతుంది కాబట్టి విడాకుల అనంతరం టామ్ క్రూయిజ్, క్యాట్ హాల్మస్‌కు భారీ మొత్తంలో చెల్లించనున్నట్లు తెలిపాడు. విడాకులు ఫైనలైజ్ అయిన తర్వాత నవంబర్ 2006 నుండి ఇద్దరూ వారి వారి ప్రాజెక్టుల ద్వారా వచ్చిన సంపాదనను తెలుపుతారు.
బేవరి హిల్స్‌లో ఉన్న $35 మిలియన్ ఖరీదైన మాన్షన్‌తో పాటు సంవత్సరానికి గాను క్యాట్ హాల్మస్‌కు $3 మిలియన్లు భరణం క్రింద లభించనుందని సమాచారం. కాలిఫోర్నియా కమ్యూనిటీ ఆస్తి చట్టాలలో ముందున్న వివాహ ఒప్పందం ప్రకారం ఏదైనా జంట 11 సంవత్సరాల పాటు కలిసి జీవించి.. ఆ తర్వాత విడాకులు తీసుకున్నట్లైతే వారి ఆస్తులు ఆ జంట ఇద్దరికీ 50/50 సమానంగా పంచబడతాయి. కానీ వీరి విషయంలో అలా జరగదు. ఎందుకంటే టామ్ క్రూయిజ్, క్యాట్ హాల్మస్ ప్రేమించి వివాహం చేసుకోని కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే అవుతుంది.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications











