టామ్ క్రూజ్ భార్య క్యాటీ 'ఆత్మ'ఘోష
హాలీవుడ్ యాక్షన్ హీరో టామ్ క్రూజ్ భార్య, నటీమణి క్యాటీ హాల్మస్ కు హారర్ సినిమాలంటే చాలా ఇష్టం అట. అంతే కాదండోయ్ ఏకంగా తనని తాను స్క్రీన్ మీద దెయ్యంలాగా చూసుకోవాలని ఉందట. ఇటీవలే అమెరికా ఎలెన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో ఈ విధంగా చెప్పుకొచ్చింది. 'మ్యాడ్ మనీ' చిత్రం ద్వారా మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈమెను త్వరలో దెయ్యంగా చూడబోతున్నామన మాట.
టామ్ క్రూజ్ ను వివాహం చేసుకున్న ఈమెకు నటన కన్నా కుటుంబమే ముఖ్యమట. తన మూడేళ్ల కూతురు సూరితో ఎక్కువ సమయం గడుతానంటున్న ఈమె త్వరలోనే ఓ మంచి సినిమా ద్వారా మన ముందుకు రావాలని చూస్తోంది. బహుశా దయ్యంగా వస్తుందేమో!!
More from Filmibeat
క్యాటీ హాల్మస్ టామ్ క్రూజ్ హాలీవుడ్ మ్యాడ్ మనీ ఎలెన్ పత్రిక katie holmes mad money elle magazine tom cruise hollywood


Click it and Unblock the Notifications











