ఆ రోజు ఎలా గడవనుందో..?? ఊహించుకోలేక పోతున్నాను..!!
ఇంగ్లాడుకు చెందిన బేర్ బాడీ మోడల్ క్యాటీ ప్రైజ్ తనకు రాబోయే క్రిస్ట్ మస్ చాలా భారంగా గడుస్తుందని ఆవేదన వ్యక్తం చేసింది. అదేంటి ఇంగ్లాండ్ వంటి దేశాల్లో క్రిస్ట్ మస్ ను ఎంతో ఆనందంగా ఓ ఉత్సవంలా జరుపుకుంటారు కదా..!! మరి ఇలాంటి శుభదినం భారంగా గడవడం ఏంటీ అనుకుంటున్నారా..?? ఇదే ప్రశ్నను ఆమెను అడిగితే గట్టిగా నిట్టూర్చి ఇలా సమాధానం చెప్పుకొచ్చింది.
ఆమె చెప్పిన సమాధానం ఆమె మాటల్లోనే "ఇది నేను నా భర్త పీటర్ ఆండ్రీ నుండీ విడిపోయాకా జరుగుతున్న మొదటి క్రిస్ట్ మస్ వేడుక. అతను లేకుండా క్రిస్ట్ మస్ వేడుకలు ఎలా జరుపుకోవాలో తెలియడం లేదు. కానీ ఆ రోజు మాత్రం చాలా భారంగా గడుస్తుంది అని మాత్రం తెలుసు. ఆ రోజున ఒంటరిగా ఎలా నిద్రలేవాలో తలచుకుంటేనే చాలా బాధగా వుంది. అందుకే నా కుటుంబ సభ్యులను ఇక్కడికి రమ్మన్నాను. మా అమ్మ, సోదరున్ని మరియు సోదరిని ఈ క్రిస్ట్ మస్ తనతో కలసి జరుపుకొమ్మన్ని ఆహ్వానించాను. వారు కూడా ఎంతో సంతోషంగా సరేనన్నారు. మేమందరం కలసి ఈ క్రిస్ట్ మస్ రోజున ఆనందంగా గడపాలని నిర్ణయించుకున్నాం" అని చెప్పుకొచ్చింది.
కాగా ఈ క్రిస్ట్ మస్ రోజున క్యాటీ తన మాజీ భర్త పీటర్ కు ఓ బహుమతి పంపించాలనుకుంటున్నట్టు కూడా తెలిపింది. మరి ఆమె బాయ్ ఫ్రెండ్ అలెక్స్ రెయిడ్ సంగతో?? ఏమో మరి ఆమె అసలు అతని ప్రస్తావన తీసుకురావడానికి కూడా ఇష్టపడలేదు.


Click it and Unblock the Notifications











