వారిద్దరూ మరో సారి పబ్లిగ్గా తిరుగుతున్నారు..!!

By Kuladeep

హాలీవుడ్ మోడల్ క్యాటీ ప్రైజ్ తన గురించి మీడియాతో అస్సలు మాట్లాడకూడదనే నిబంధనతో బాక్సర్, క్రాస్ డ్రెస్సర్ అలెక్స్ రెయిడ్ తో డేటింగ్ చేస్తోంది. కానీ అతను తన గురించి మీడియాతో మాట్లాడాడనే విషయం తెలుసుకున్న క్యాటీ ఆస్ట్రేలియాలోని ఓ టీవీ షోను కేంద్రంగా చేసుకుని ఇక పై తను రెయిడ్ తో కలసి వుండబోనని, తామిద్దరి మధ్య బంధానికి ఇక పై రోజులు చెల్లిపోయాయని ప్రకటించింది.

కానీ ఆ తర్వాత వారిద్దరి మధ్య జరిగిన సెక్స్ విషయాలను కథలుగా అమ్ముతానని రెయిడ్ బెదిరించడంతో తిరిగి అతనితో రహస్యంగా సంబంధాన్ని కొనసాగిస్తోందనే వార్తలు వచ్చాయి. ఆమె సన్నిహితులు కూడా ఈ విషయాన్ని దృవీకరించారు. దీంతో ఇంకేముందిలో అందరికీ తెలిసిపోయిందని అనుకుందో మరేమిటో తెలియదు కానీ ఇన్నాళ్లు రహస్యంగా కలసి తిరిగిన వీరిద్దరూ ఇటీవల జరిగిన X-ఫ్యాక్టర్ పైనల్స్ లో కలసి హాజరయ్యి తామిద్దరూ కలసిపోయామని పబ్లిక్ గా తెలియజేసారు.

కానీ దీనిపై స్పందిన క్యాటీ మాత్రం వారిద్దరి మధ్య స్నేహానికి మించి మరోటి లేదని చెప్పుకొచ్చింది. కానీ ఈ షో లో వీరిద్దరూ ఎంతో సన్నిహితంగా మెలుగుతూ కనిపించారట. వీరిద్దరూ తిరిగి కలసిపోవడం పట్ల ఆమె స్నేహితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెయిడ్ విషయంలో జాగ్రత్తగా వుండమని, ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారట. కానీ క్యాటీ వీరిమాటలను పట్టించుకున్నట్టు లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X