వారిద్దరూ మరో సారి విడిపోనున్నారు
ఇంగ్లాడుకు చెందిన ప్రముఖ బేర్ బాడీ మోడల్ క్యాటీ ప్రైజ్ మరోసారి తన బాయ్ ఫెండ్ అలెక్స్ రెయిడ్ నుండీ విడిపోనుంది. ఇంతకు ముందు క్యాటీ ఆస్ట్రేలియాలో 'ఐయామ్ సెలబ్రిటీ గెట్ మీ అవుట్ ఆఫ్ హియర్' రియాలిటీ షోలో పాల్గొనడానికి ఆస్ట్రేలియా వెళ్లినప్పుడు రెయిడ్ ఆమె నిబంధనలు కాదని మీడియాతో వారిద్దరి సంబంధం గురించి మాట్లాడటంతో కలత చెందిన క్యాటీ ఇక పై తాను రెయిడ్ తో కలసి వుండలేనని ప్రకటించింది.
ఆ తర్వాత ఆమె అతనితో చేసుకున్న అగ్రిమెంట్ లో రెయిడ్ తన పేరున కాకుండా, క్రాస్ డ్రెస్సర్ గా చలామణీ అయ్యే రొక్సానీ పేరున సంతకం చెయ్యడంతో ఆ అగ్రిమెంటు చెల్లకుండా పోయింది. దీంతో అతను వారిద్దరి మధ్య జరిగిన సెక్స్ సంబంధిత విషయాలను బయటపెడతాడేమో అని ఆమె భయపడింది. రెయిడ్ కూడా ఇక పై ఆమె చెప్పినట్టు నడుచుకుంటానని చెప్పడంతో ఆమె అతనితో రహస్యంగా సంబంధం కొనసాగించింది. కానీ ఈ విషయాన్ని ఆమె ఎంతో కాలం దాచలేక పోయింది. ఆ తర్వాత వారిద్దరి సంగతి అందరికీ తెలిసిపోయే సరికి తిరిగి పబ్లిక్ గా వారిద్దరూ తిరగనారంభించారు. ఆ తర్వాత రెయిడ్ కు వచ్చిన పబ్లిసిటీని దృష్టిలో వుంచుకొని అతన్ని ఓ రియాలిటీ షోలో పాల్గొనే అవకాశం వరించింది.
ఈ షోకు వెళ్లే ముందు ఎలా నడుచుకోవాలీ అని క్యాటీ రెయిడ్ ను శిక్షణ కూడా ఇచ్చింది. ఈ షోలో వారిద్దరి సంబంధం గురించి నోరు మెదపద్దని క్యాటీ చెప్పినప్పటికీ రెయిడ్ ఆమె మాటలను పెడచెవిన పెట్టాడు. అతను వారిద్దరి సంబంధం గురించి మాట్లాడుతుంటే విని అవాక్కయిపోవడం క్యాటీ వంతయింది. దీంతో ఆమె రెయిడ్ తో బంధాన్ని తెంచేసుకోవడమే ఉత్తమం అనే అభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది. ఇంతకు ముందు అలాగే పేలీన క్యాటీ ఆ తర్వాత తుస్సుమనింది. మరి ఈ సారయినా మాట మీద నిలబడుతుందా...??


Click it and Unblock the Notifications











