భర్త కాదన్నాడని తాగితూలుతున్న స్టార్ మోడల్
తన బాయ్ ఫ్రెండ్ అలెక్స్ రెయిడ్ తో తనకున్న అనుబంధాన్ని తెంచేసుకుని మరీ తన మాజీ భర్తను తిరిగి తన సొంతం చేసుకోవాలనుకున్న క్యాటీ ప్రైజ్ ఆశలు పీటర్ ఆండ్రీ తిరిగి కలసిపోవడానికి ఒప్పుకోకపోవడంతో అడిఆశలయ్యాయి. పీటర్ ఆండ్రీ నిర్ణయంతో క్యాటీ మనస్థాపానికి గురయినట్టు ఆమె సన్నిహితులు చెబుతున్నారు. దీంతో ఆమె మోతాదుకు మించి తాగుతూ సమయాన్ని గడుపుతోందని వార్తలు వినిపించాయి. కానీ ఈ వార్తలను ఆమె సన్నిహితులు కొట్టిపారేసారు.
కానీ ఇటీవల ఆమె బాగా తాగి నడవలేని స్థితిలో మరి కొందరి సాయంతో బార్ నుండీ బయటకు రావడాన్ని గమనించిన ఫోటోగ్రాఫర్లు ఒక్కసారిగా తమ కెమెరా కళ్లకు పనిచెప్పారు. ఇందులో ఆమె కనీసం సరిగా నిలబడలేని స్థితిలో వుండి ఇద్దరు వ్యక్తుల సాయంతో బయటకు రావడం కనిపించింది. కానీ ఈ విషయం పై మాట్లాడిన క్యాటీ మాత్రం తాను మందు తాగలేదని, బాగానే వున్నానని చెప్పడం కొసమెరుపు.
More from Filmibeat
క్యాటీ ప్రైజ్ అలెక్స్ రెయిడ్ పీటర్ ఆండ్రీ హాలీవుడ్ మోడల్ katie price peter andre alex reid model hollywood


Click it and Unblock the Notifications











