క్యాన్సర్ వస్తుందేమోనని భయపడుతోంది!!
గ్లామరస్ మోడల్ జోర్డాన్ క్యాటీ ప్రైజ్ నిరంతరం ఒత్తిడితో జీవిస్తున్న తనకు క్యాన్సర్ వస్తుందేమోనని భయపడుతోందట. ఇంతకు ముందు లియోమైసర్కొక లాంటి అరుదైన జబ్బుతో బాధపడిన ఈమె ప్రస్తుతం ఎక్కడ తనకు క్యాన్సర్ వస్తుందేమోనని భయపడుతున్నానని స్వయంగా ఆమే తెలిపింది. 2002 లో ఈ జబ్బు బారిన పడ్డ ఆమె ఆ తర్వాత కోలుకున్నారు.
ప్రస్తుతం తన జీవితం నిరంతరం ఒత్తిడిమయం అయిపోయిందని, ఒత్తిడి వల్ల క్యాన్సర్ వస్తుందని డాక్టర్లు సలహాయిచ్చారని, కానీ తన జీవితంలో జరుగుతున్న ప్రతీదీ తనలో ఒత్తిడిని పెంచుతోందని ఆమె బాధపడుతోంది. కాగా ఈమె ఇటీవలే తన భర్త పీటర్ ఆండ్రీ నుండీ విడిపోయి బాక్సర్ రెయిడ్ తో కలసివుంటోంది.
క్యాటీ ప్రైజ్ హాలీవుడ్ క్యాన్సర్ పీటర్ ఆండ్రీ అలెక్స్ రెయిడ్ katie price hollywood cancer peter andre alex raid


Click it and Unblock the Notifications