ప్రియుడి చేతిలో మోసపోయిన మోడల్ ఏం చేసింది...??
హాలీవుడ్ హాట్ మోడల్, ఎదపొంగులను చూపించడంలో తనకు ఎవ్వరూ సరిరారని నిరూపించుకున్న క్యాటీ ప్రైజ్ తాజాగా తన ప్రియుడి చేతిలో మోసపోయింది. ఆ తర్వాత అతని నోరు మూయించడానికి నానా కష్టాలు పడుతోంది. అసలు ఏంటి ఆ కథ అని ఆసక్తిగా వుందా అయితే మీరు ఈ వార్త చదవాల్సిందే.
క్యాటీ ప్రైజ్ హాలీవుడ్ ను ఓ ఊపు ఊపిన ఒకనాటి మోడల్. ఆ తర్వాత టి.వీ. లలో ప్రసారమయ్యే రియాలిటీ షోల ద్వారా ప్రపంచం మొత్తం తన సెక్సీ ఫిగర్ తో అభిమానులను సంపాదించుకుంది. అలా ఓ రియాలిటీ షోలో పాల్గొన్న క్యాటీ అక్కడ పీటర్ ఆండ్రీ అనే ఓ ఆస్ట్రేలియా గాయకుడిని కలిసి మనసు పారేసుకుని అతన్ని పెళ్లి చేసుకుంది. అతడి ద్వారా ముగ్గురు పిల్లలు కలిగాకా, ఇటీవలే అతనికి విడాకులు ఇచ్చింది.
ఆ తర్వాత ఒంటరిగా వున్న క్యాటీ కి అమ్మాయిలాగా వేషధారణ చేసుకునే ఓ దిక్కుమాలిన రోగం వున్న క్రాస్ డ్రెస్సర్, బాక్సర్ అలెక్స్ రెయిడ్ పరిచయం అయ్యాడు. అతని తో సంబంధాన్ని ఏర్పరచుకొనే ముందు క్యాటీ అతనితో ఓ అగ్రిమెంటు రాయించుకొంది. ఈ అగ్రిమెంటు ప్రకారం ఏ కారణం చేతనయినా వారిద్దరూ విడిపోతే ఆమె వ్యక్తిగత విషయాలు బయటపెట్టడానికి వీలు లేదు. దీనిపై అతగాడు సంతకం కూడా చేసాడు.
కానీ ఇప్పుడు అతడు సరైన మగాడు అని భావించిన క్యాటీ అతని నుండీ విడిపోవాలని భావించింది. కానీ ఇప్పుడు అతను తిరిగి ఆమెను తన వ్యక్తిగత విషయాలను కథలుగా అమ్ముతానని బెదిరిస్తున్నాడట. అదేంటి అగ్రిమెంటు మీద సంతకం కూడా చేసావు, నీ మీద కోర్టుకెలతా అంటూ బెదిరించాలనుకున్న క్యాటీ ఖంగుతినేలా అతను తను చేసిన మోసాన్ని ఆమెకు చల్లగా చెప్పాడు.
అదేంటి అంటే అతగాడు అమ్మాయి లాగా డ్రస్ చేసుకున్నప్పుడు రోక్సీ అనే పేరుతో చెలామణీ అవుతుంటాడట. అదే పేరుతో సంతకం చేసాడట ఆయన గారు. దీంతో ఈ అగ్రిమెంటు చెల్లదని చెప్పడం తో క్యాటీ గొంతులో పచ్చి వెలగపండు పడినట్టు అయింది. ఇంకేం చేసేది లేక అతని నోరు మూయించేందుకు అతనితో సంబంధాన్ని కొనసాగించేందుకు సిద్ధపడిందట. పాపం క్యాటీ....!!


Click it and Unblock the Notifications











