మరొకరితో అక్రమ సంబంధం: భర్త మీద హీరోయిన్ ‘రివేంజ్’
లాస్ ఏంజిల్స్: బ్రిటన్ మోడల్, టీవీ స్టార్ క్యాటీ ప్రైస్ తన మాజీ భర్త కేరన్ హేలర్‌ను ఎప్పటికీ క్షమించను అంటోంది. హేలర్ తనను మోసం చేసాడని, తన స్నేహితురాలితోనే అక్రమ సంబంధం కొనసాగించాడని ఆమె తెలిపారు.
నా స్నేహితురాలు జేన్ పౌట్నీతో అక్రమ సంబంధం పెట్టుకుని నాకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడని....నన్ను మోసం చేసిన అతన్ని ఎప్పటికీ క్షమించను. అంతటితో ఆగకుండా తనను మోసం చేసి ఈ ఇద్దరు ఎలా తమ సంబంధం కొనసాగించారనే విషయాలను ఓ పుస్తక రూపంలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది.
ఈ పుస్తకానికి ఆమె 'రివేంజ్' అనే పేరుతో రిలీజ్ చేయబోతున్నారు. ఈ పుస్తకంలో అన్ని విషయాలను బయట పెడతాను, త్వరలోనే ఆ పుస్తకాన్ని రిలీజ్ చేస్తాను అని ఇటీవల ఓ మేగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్యాటీ ప్రైస్ వెల్లడించారు.
స్లైడ్ షోలో క్యాటీ ప్రైస్ జీవితంలో ఎదుర్కొన్న చేదు జ్ఞాపకాలు...

భర్త, స్నేహితురాలు
నా స్నేహితురాలు జేన్ పౌట్నీతో అక్రమ సంబంధం పెట్టుకుని నాకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడని....నన్ను మోసం చేసిన అతన్ని ఎప్పటికీ క్షమించను. అంతటితో ఆగకుండా తనను మోసం చేసి ఈ ఇద్దరు ఎలా తమ సంబంధం కొనసాగించారనే విషయాలను ఓ పుస్తక రూపంలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది.

లైంగిక వేధిపులు
ఏడేళ్ల వయసులోనే లైంగిక వేదింపులకు గురైంది. యుక్తవయసుకు వచ్చాక అత్యాచారానికి గురైంది. యుక్త వయసులో ఉన్నపుడు కొందరు మగాళ్లు తనను చుట్టు ముట్టి రేప్ చేసినట్లు కూడా ఆమె గతంలో వెల్లడించారు. గ్లామర్ ప్రపంచంలోకి ఎందుకొచ్చానా? అని భాధ పడ్డ రోజులు కూడా ఉన్నాయని ఆమె తెలిపారు.

పెళ్లి, విడాకులు
పెళ్లి చేసుకోవడం, విడిపోవడం లాంటి వాటితో విసిగిపోయానని, అందుకే ఇకపై పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నట్లు గతంలో ఆమె చెప్పుకొచ్చింది.

ఆమెను రేప్ చేసిన సెలబ్రిటీ ఎవరు?
ఓ సెలబ్రిటీ కూడా రేప్ చేసాడంట గతంలో ఓ సారి ఆమె ఓ షాకింగ్ విషయం బయట పెట్టింది. ఓ ప్రముఖ సెలబ్రిటీ తనను రేప్ చేసాడని చెప్పుకొచ్చారు. అయితే అతను ఎవరు? అనే విషయం మాత్రం క్యాటీ ప్రైస్ బయట పెట్టలేదు.

పిల్లలే జీవితం
పిల్లలే జీవితం 39 సంవత్సరాల ఈ అమ్మడు తన ఐదుగురు పిల్లలే జీవితంగా జీవిస్తోంది.


Click it and Unblock the Notifications











