»   » ఒకప్పుడు ఆమెను ఆరాధించిన వారే ఇప్పుడు ముఖాన ఉమ్మేస్తున్నారు..!!

ఒకప్పుడు ఆమెను ఆరాధించిన వారే ఇప్పుడు ముఖాన ఉమ్మేస్తున్నారు..!!

Posted By:
Subscribe to Filmibeat Telugu

లండన్ కు చెందిన ఒకప్పటి టాప్ మోడల్ క్యాటీ ప్రైజ్ పేరు చెబితేనే అందరూ ఛీ కొడుతున్నారు. ఒకప్పుడు ఆమె టాప్ లెస్ సెలబ్రిటీగా ఓ ఊపు ఊపి అందరి చేత వావ్ అనిపించుకొంది. కానీ ఇప్పుడు మాత్రం ఆమె బరితెగించిన ప్రవర్తనతో ఛీ కొట్టించుకొంటోంది. తొలుత ఓ రియాలిటీ షోలో పాటర్ ఆండ్రీ అనే ఓ ఆస్ట్రేలియా గాయకున్ని ప్రేమించి పెళ్లి చేసుకున్న క్యాటీ ఆ తర్వాత అతని మీద మోజు తీరిపోయి వదిలేసి విమర్శలపాలయింది. ఆ తర్వాత ఎన్నో ఒడిదుడుకుల మధ్య అలెక్స్ రెయిడ్ ను డబ్బుకోసం పెళ్లి చేసుకుని సర్వత్రా విమర్శల పాలయింది.

అంతటితో ఆగకుండా తను బరితెగించిన యువతి అని పేరుతెచ్చుకోవడమే కాకుండా ఇప్పుడు తన కూతురిని కూడా చెడగొడుతోంది. ఇంకా రెండేళ్లు కూడా నిండని తన కూతురు ప్రిన్సెస్ ను తన లాగే బట్టలిప్పుకొని మోడలింగ్ చెయ్యమని ప్రోత్సహిస్తానంటూ చెప్పడం ఆమె బరితెగించిన తత్వానికి పరాకాష్ట. దీంతో ఆమెను అభిమానించిన వారే ఇప్పుడు ముఖాన ఉమ్మేస్తున్నారు. కానీ ఆమె ఓ మాత్రం చలించడం లేదు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu