మీడియాకు నా గురించి అంత ఆసక్తి ఎందుకు??
ఇటీవల హాలీవుడ్ మోడల్ క్యాటీ ప్రైస్ తన తాజా పుస్తకం ఆవిష్కరణ సందర్భంలో ఒక టీవీ షోలో పాల్గొంది. ఈ బ్రిటిష్ బ్యూటీ ఇటీవలే ఆస్ట్రేలియా గాయకుడు పీటర్ ఆండ్రీ తో తెగతెంపులు చేసుకుని కొత్త బాయ్‌ఫ్రెండ్ బాక్సర్ ఎలెక్స్ రెయిడ్ తో చెట్టాపట్టాలేసుకుని లండన్ వీధుల్లో తిరుగుతోంది. తన పుస్తకం గురించి టీవీ షోలో ప్రచారం ముగిశాక విడాకుల విషయమై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ "గత నాలుగు నెలలుగా నేను ఈ విషయంలో నోరుమూసుకున్నా, అయినా మీడియాలో లేనిపోని రాద్ధాంతం జరుగుతోంది. మీడియా రాతల్ని సహజంగానే ప్రజలు నిజమేననుకుంటారు. ఇది పూర్తిగా మా వ్యక్తిగతానికి సంబంధించినది. ఈ విషయంగా వివాదం కాకూడదనే ఇంత వరకూ రహస్యంగా ఉంచడం జరిగింది. నేనూ అందరిలాంటి దాన్నే... ఇక లాభం లేదనుకుని ఇపుడు నోరు విప్పాల్సివచ్చింది. అవును ఆండ్రీ తో తెగతెంపులు చేసుకున్న మాట నిజామే అయినా కత్తికి లేని దురద కందకు ఎందుకు అని నాకు లేని బాధ మీకెందుకు, దయచేసి అకనైనా నా గురించి అనవసర విషయాలు రాయడం ఆపేయండి" అని స్పష్టం చేసింది.


Click it and Unblock the Notifications











