»   » పెళ్లి పెద్ద సెక్స్ స్కాండిల్ ఇరుకున్నందుకు వారిద్దరి పెళ్లి రద్దుచేసారు..!

పెళ్లి పెద్ద సెక్స్ స్కాండిల్ ఇరుకున్నందుకు వారిద్దరి పెళ్లి రద్దుచేసారు..!

Subscribe to Filmibeat Telugu

వివాదాల మోడల్ క్యాటీ ప్రైజ్ ఇటీవలే తన బాయ్ ఫ్రెండ్ అలెక్స్ రెయిడ్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వెంటనే పెళ్లిచేసుకోవాలని నిర్ణయించుకున్న వీరు ఆదరాబాదరాగా లాస్ వేగాస్ లోని మ్యారేజ్ సెరిమోనిలో వివాహం చేసుకున్నారు. కానీ ఇప్పుడా పెళ్లి చట్టబద్ధంగా చెల్లదని అధికారులు తెల్చిపారేసారు. దీనికి కారణం క్యాటీ ఇంతకు ముందు పీటర్ ఆండ్రీని పెళ్లిచేసుకోవడమో లేక అలెక్స్ రెయిడ్ క్రాస్ డ్రస్సర్ కావడమో... మరొకటో కాదు. దీనంతటికీ కారణం వీరిద్దరికీ పెళ్లిచేసిన అధికారి.

వీరి వివాహ దృవీకరణ పత్రం మీద సంతకం చేసిన అధికారి రెవ్ మోస్ హెన్నీ ఇంతకు ముందు ఓ సెక్స్ స్కాండిలో లో ఇరుక్కోవడంతో ఆయన్ని విధుల నుండీ బహిష్కరించారు. దీంతో ఈయన చేసిన వీరిద్దరి పెళ్లి చెల్లదని అధికారులు నివేదించారు. ఇక మీడియా వారి కోసం మరో సారి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న ఈ జంట అధికారుల కోసం మరో సారి పెళ్లిచేసుకోవాల్సి వుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu