ఆమె అతన్ని వదిలేయనుందా....??
ప్రముఖ హాలీవుడ్ మోడల్ క్యాటీ ప్రైజ్ తాజా బాయ్ ఫ్రెండ్ అలెక్స్ రెయిడ్ ఆమె ఎక్కడ తనని మోసం చేస్తుందోనని భయపడుతున్నాడు. ఇటీవల క్యాటీ 'ఐయామ్ సెలబ్రిటీ' అనే రియాలిటీ షో పాల్గొనడానికి ఆస్ట్రేలియా వెళ్లిన సంగతి తెలిసిందే. కాగా ఇంతకుముందు ఇదే షోలో పాల్గొన్నప్పుడే ఆమె తన మాజీ భర్త ఆస్ట్రేలియా సింగర్ పీటర్ ఆండ్రీని ప్రేమించి ఆ తర్వాత వివాహం చేసుకున్నారు. అభిప్రాయ భేదాల వల్ల ఈ ఏడాది అతని నుండీ విడిపోయిన క్యాటీ ఆ తర్వాత అలెక్స్ రెయిడ్ తో డేటింగ్ చేస్తోంది. ఇదిలా వుంటే ఆస్ట్రేలియా వెళ్లిన ఆమె ఎక్కడ తన మనసు మార్చుకొని తిరిగి తన మాజీ భర్తతో కలసిపోతుందోనని రెయిడ్ తెగ ఆందోళన చెందుతున్నాడు. అంతే కాకుండా ఇటీవల క్యాటీ-పీటర్ దంపతుల బిడ్డ హార్వే కు ఇటీవలే ఆరోగ్యం బాగాలేకపోవడంతో పీటర్ ఆమెను పరామర్శించడం లాంటి సంఘటనలు రెయిడ్ ను మరింత కలవరపెడుతున్నాయి.
ఈ విషయమై ఓకే పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో క్యాటీ, ఆండ్రీతో కలసిపోతే ఏం చేస్తారు అనే ప్రశ్నకు సమాధానంగా "నేను ఆమెను ఎంతో నమ్మాను. నన్ను మోసం చెయ్యదనే అనుకుంటున్నాను. కానీ ఆమె అదే చేస్తే ఇక నేను చేసేది ఏముంటుంది??" అని వేదాంత ధోరణిలో సమాధానమిచ్చాడు. క్యాటీ కూడా పీటర్ ఆండ్రీకి తిరిగి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.


Click it and Unblock the Notifications











