వారిద్దరి మధ్య సయోధ్య కోసం..అతని ఆరాటం
ప్రముఖ మోడల్ క్యాటీ ప్రైజ్ తన భర్త పీటర్ ఆండ్రీ నుండీ చట్టబద్దంగా విడిపోయి బాక్సర్ అలెక్స్ రెయిడ్ తో సహజీవనం సాగిస్తుండటం తెలిసిందే. వీరి ఇద్దరి మధ్య వున్న సంబంధం గురించి రోజుకొక వార్త పుట్టుకొస్తోంది. తాజాగా రెయిడ్ బాక్సర్ గా మంచి పేరు తెచ్చుకుంటున్న ఈ సమయంలో డబ్బు వెళ్లువలా వచ్చిపడుతండటంతో క్యాటీ ప్రైజ్ ను వదిలేయనున్నాడనే వార్తలు పుట్టుకొచ్చాయి. దీనిపై ఇటీవల సండే మిర్రర్ పత్రికకు ఇచ్చిన ఓ ఇంటర్యూలో రెయిడ్ స్పందిస్తూ "అసలు ఈ వార్తలో నిజం లేదని, డబ్బు, హోదా ముఖ్యం కాదని మనకంటూ ఓ మనిషి వున్నాడు అనిపించే అనుభూతి ఎంత డబ్బు పెట్టినా రాదని చెప్పాడు. తనకు క్యాటీతో జీవితం ఎంతో సంతోషంగా వుందని, ఆమెతో జీవితాంతం కలసివుండాలని వుందని చెప్పాడు".
అంతే కాదండోయ్ ఈయన గారు తన ప్రేయసికి, ఆమె మాజీ భర్తకు మధ్య గల స్పర్థలు తొలగించాలనుకొంటున్నట్టు కూడా చెప్పాడు. ఇటీవల క్యాటీ తన కొడుకు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఈ విషయం గురించి పిల్లాడి తండ్రి అయిన పీటర్ కు కనీసం సమాచారం ఇవ్వలేదు. అంతే కాదు వీరిద్దరూ విడిపోయినా రోజూ మాటల యుద్ధం నడుస్తూనే వుంది. దీనికి రెయిడ్ అడ్డుకట్టవెయ్యాలనుకుంటున్నాడు. చూద్దాం అతని ప్రయత్నం ఎంత వరకూ సఫలమవుతుందో..!!


Click it and Unblock the Notifications











