అమ్మకానికి హీరోయిన్...కృత్రిమ వక్షోజాలు!

By Bojja Kumar

హైదరాబాద్: మాజీ మోడల్, హాలీవుడ్ బ్యూటీ క్యాటీ ప్రైస్ తన వక్షోజాలు అందంగా కనిపించడానికి ఇప్పటి వరకు ఆరు సర్జరీలు చేయించుకుంది. ఈ సర్జరీల్లో ఆమెకు బ్రస్ట్ ఇంప్లాంట్స్(వక్షోజాలు పెద్దగా కనిపించడానికి ఉపయోగించేవి) అమర్చారు. సర్జరీ జరిగిన ప్రతిసారి పాతవి తీసి, కొత్తవి వేసారు. అలా ఆమె తన పాత బ్రస్ట్ ఇంప్లాంట్స్ భద్రపరుచుకుంది.

తాజాగా క్యాటీ ప్రైస్ తన ఓల్డ్ బ్రస్ట్ ఇంప్లాంట్స్ అమ్మకానికి పెట్టాలని నిర్ణయించుకుంది. చారిటీ కార్యక్రమానికి నిధుల సేకరణ కోసం ఈ కార్యక్రమానకి శ్రీకారం చుడుతున్నట్లు ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. బ్రస్ట్ క్యాన్సర్ నివారణ కోసం పని చేస్తున్న సంస్థలకు తద్వారా వచ్చిన డబ్బును అందించనుంది.

Katie Price to sell old breast implants for a cause

క్యాటీ ప్రైస్ గురించిన ఇతర వివరాల్లోకి వెళితే...క్యాటి ప్రైస్ ఇప్పటికి మూడు వివాహాలు చేసుకుంది. అయితే ఇటీవల ఆమె మూడో పెళ్లి కూడా పెటాకులైంది. దీంతో ఇక పెళ్లి జోలికే పోను అంటోంది. కేరన్ హేలర్‌తో క్యాటీ ప్రైస్ వివాహం 2013 జనవరిలో జరిగింది. బహమాస్‌లో వీరి వివాహం జరిగింది. వీరికి ఆగస్టులో జెట్ అనే మగపిల్లాడు జన్మించాడు. హేలర్ కంటే ముందు క్యాటీ ప్రైస్‌కు రెండు సార్లు వివాహం జరిగింది. ఆస్ట్రేలియన్ పాప్ స్టార్ పీటర్ ఆండ్రూ, కేజ్ ఫైటర్ అలెక్స్ రేడ్‌తో వివాహం జరిగింది. ముగురు పిల్లలు కూడా ఉన్నారు.

ఓ రేడియో షోలో తన జీవితంలో చోటు చేసుకున్న పలు చేదు జ్ఞాపకాలను బయట పెట్టింది. అన్ సెన్సార్డ్ ఇంటర్నెట్ రేడియో స్టేషన్ ఫుబర్ షోలో ఆమె మాట్లాడుతూ.....తనకు ఏడేళ్ల వయసు ఉన్నపుడే లైంగిక వేధింపులకు గురైనట్లు తెలిపింది. ఆమె మాట్లాడుతూ...'నాకు ఏడేళ్ల వయసు ఉన్నపుడు అమ్మతో కలిసి పార్కుకు వెళ్లాను. అమ్మ నాకు ఐస్ క్రీం తీసుకురావడానికి వెళ్లింది. ఆ సమయంలో ఓ పెద్దమనిషి వచ్చి నన్ను లైంగికంగా వేధించాడు. ఆ సంఘటన నేను నా జీవితంలో ఇప్పటికీ మరిచిపోలేదు' అని క్యాటీ ప్రైస్ చెప్పుకొచ్చారు. అంతే కాకుండా మోడలింగ్ చేసే రోజుల్లోనూ క్యాటీ ప్రైస్ లైంగిక వేధింపులు ఎదుర్కొంది. యుక్త వయసులో ఉన్నపుడు కొందరు మగాళ్లు తనను చుట్టు ముట్టి రేప్ చేసినట్లు ఆమె వెల్లడించారు. గ్లామర్ ప్రపంచంలోకి ఎందుకొచ్చానా? అని భాధ పడ్డ రోజులు కూడా ఉన్నాయని ఆమె తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X