తనని తిరిగి తన జీవితంలోకి ఆహ్వానించలేను...!!
ప్రముఖ హాలీవుడ్ మోడల్ క్యాటీ ప్రైజ్ తన బాయ్ ఫ్రెండ్ అలెక్స్ రెయిడ్ తో కలసి వుండలేనని ఆస్ట్రేలియాలో ప్రకటించిన తర్వాత యుకె కు తిరిగి వచ్చింది. వచ్చిన తర్వాత ఆమె తన మాజీ బాయ్ ఫ్రెండ్ అలెక్స్ రెయిడ్ ను లంచ్ కు ఆహ్వానించి ఇకపై మనమిద్దరం స్నేహితుల్లా వుందామని చెప్పినట్టు తెలిసింది. కానీ తిరిగి ఆమె అతన్ని లంచ్ కు ఆహ్వానించడంతో ఆమె తిరిగి అతనితో కలసిపోనుందనే వార్తలు వెలువడ్డాయి. దీనికి తోడు తనని వదిలెయ్యద్దని రెయిడ్ ఆమెను బ్రతిమలాడటంతో, దానికి ఆమె సమ్మతించే అతన్ని తిరిగి ఆహ్వానించిదనే వార్తలు వచ్చాయి.
కానీ ఈ వార్తలను క్యాటీ కొట్టిపారేసింది. తనది చాలా స్ట్రాంగ్ మైండ్ అని, తనేదైనా అనుకుంటే వెంటనే చేసేస్తానని తిరిగి ఆలోచించే ప్రసక్తే వుండదని తేల్చిపారేసింది. కానీ ఆమె విడాకులు ఇచ్చిన మాజీ భర్త పీడర్ ఆండ్రీని మాత్రం తిరిగి తనని భార్యగా స్వీకరించాలని అడుగుతోందట. నాది చాలా స్ట్రాంగ్ మైండ్ అని చెప్తున్న ఈ అమ్మడు వద్దని విడాకులిచ్చిన భర్తను తిరిగి కావాలని కోరుకోవడం ఆమె చంచలన మనస్థత్వాన్ని సూచిస్తోందని మానసిక నిపుణులు అంటున్నారు. ఇలాంటి వారి వల్ల వారి భాగస్వామ్యులు ఇబ్బందులు పడాలే కానీ సుఖపడటం ఉండదని కూడా వారు అంటున్నారు.


Click it and Unblock the Notifications











