క్యాటీ, రెయిడ్ ను పెళ్లి చేసుకోనుందా??

By Kuladeep

ఒకప్పటి ప్రముఖ మోడల్, ఎప్పుడూ వివాదాల్లో వుండే క్యాటీ ప్రైజ్ 'ఐయామ్ సెలబ్రటీ గెట్ మీ అవుట్ ఆఫ్ హియర్' అనే రియాలిటీ షోలో పాల్గొనడానికి ఆస్ట్రేలియా వెళ్లి, అక్కడ తన బాయ్ ఫ్రెండ్ అలెక్స్ రెయిడ్ తో ఇక పై కలసి వుండలేనని అతనికి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఆస్ట్రేలియా నుండీ యుకె కు తిరిగి వచ్చాక ఆమెతో మాట్లాడాలనుకున్న అతని కోరికను మన్నించి అతన్ని లంచ్ కు ఆహ్వానించింది. కాగా ఆమెతో రెండు గంటల సేపు మాట్లాడిన రెయిడ్ ఆమెను తనతో పెళ్లికి ఒప్పించాడని వార్తలు వచ్చాయి.

వీరిద్దరూ కలసి 25 వేల పౌండ్లు విలువచేసే ఉంగరాన్ని చూసినట్టు, దాని మోడల్ ను తీసుకొని తన మిత్రుడి చేత అచ్చం అలాంటి ఉంగరాన్నే 9 వేల పౌండ్లతో చేయించమని రెయిడ్ కోరినట్టు తెలిసింది. కాగా ఈ ఉంగరం కోసం రెయిడ్ 6 వేల పౌండ్లను తన కుటుంబ సభ్యుల నుండీ అప్పు తీసుకున్నట్టు కూడా వార్తలు వినవస్తున్నాయి. కాగా ఈ విషయమై మీడియా వారితో ఇప్పుడే మాట్లాడవద్దని క్యాటీ, రెయిడ్ ను గట్టిగా హెచ్చరించిందట. ఇంతకు ముందు తన అనుమతి లేకుండా వారి భంధం గురించి మీడియాతో మాట్లాడాడనే రెయిడ్ ను దూరం చెయ్యాలని భావించిన క్యాటీ ఈ సారి కూడా మీడియాతో మాట్లాడితే వదిలేస్తానని హెచ్చరించిందట.

కాగా క్యాటీ తొలుత తన మాజీ భర్త పీటర్ ఆండ్రీతో వచ్చే క్రిస్ట్ మస్ సమయానికి కలసిపోవీలని ప్రయత్నించినట్టు, అందుకోసమే 'ఐయామ్ సెలబ్రటీ గెట్ మీ అవుట్ ఆఫ్ హియర్' రియాలిటీ షో నెపంతో ఆస్ట్రేలియా వెళ్లినట్లు తెలిసింది. కానీ ఆమె ఆశలపై పీటర్ నీళ్లు చల్లడంతో రెయిడ్ తో కలసి వుండాలని భావించిందని విశ్వసనీయ సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X