»   » దారుణం.... రియాల్టీ షో బ్యూటీని రేప్ చేసిన అభిమాని?

దారుణం.... రియాల్టీ షో బ్యూటీని రేప్ చేసిన అభిమాని?

Posted By:
Subscribe to Filmibeat Telugu

లండన్: అభిమానుల అత్యుత్సాహం కారణంగా సెలబ్రిటీలు ఇబ్బందులకు గురైన సందర్భాలు, వారి ప్రవర్తనతో సెలబ్రిటీలు తీవ్రమనస్తాపానికి గురైన సందర్భాలు ఇటీవల కాలంలో మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా లండన్లో ఓ అభిమాని ఏకంగా ఓ స్టార్‌ను రేప్ చేసిన సంఘటన సంచలనం క్రియేట్ చేస్తోంది.

బ్రిటిష్ డేటింగ్ రియాల్టీ షో 'లవ్ ఐలాండ్' స్టార్, ప్రముఖ మోడల్ కేటీ సాల్మన్‌ అభిమాని చేతిలో అత్యాచారానికి గురైనట్లు తెలుస్తోంది. అభిమానిని అంటూ ఆమెకు దగ్గరైన సదరు వ్యక్తి ఆమెకు తెలియకుండా కూల్ డ్రింకులో డేట్ రేప్ డ్రగ్(మత్తు మందు) కలిపి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది.

‘ది సన్’ పత్రిక కథనం ప్రకారం

‘ది సన్’ పత్రిక కథనం ప్రకారం

‘ది సన్' పత్రిక కథనం ప్రకారం కేటీ సాల్మన్ మంగళవారం రాత్రి తన ఫ్రెండ్స్‌ తో పాటు నైట్ క్లబ్ కు వచ్చింది. అక్కడ డేనియల్ అనే వ్యక్తి నేను మీ అభిమానిని అంటూ కేటీ సాల్మన్ తో కరచాలనం చేసి ఆమెతో మాటలు కలిపాడు, ఆమె కాస్త చనువు ఇవ్వడంతో పక్కనే కూర్చుని కబుర్లు చెబుతూ కొంత సేపటి తర్వాత ఆమెకు కూల్ డ్రింక్ అందించాడు. అందులో ఆమెకు తెలియకుండా డేట్ రేప్ డ్రగ్(మత్తు మందు) కలిపినట్లు తెలుస్తోంది.

మైకంలో ఉన్న ఆమెను

మైకంలో ఉన్న ఆమెను

డేట్ రేప్ డ్రగ్ (మత్తు మందు) ఎఫెక్టుతో ఆమె మత్తులోకి వెళ్లిపోయింది. అభిమానులతో నేను క్లోజ్ గా మూవ్ అవుతాను. అతడు నాకు డ్రింక్స్ అందించడం వరకు బాగా గుర్తుంది. అనంతరం వాష్ రూమ్ కు వెళ్లిన సమయంలో తల బాగా తిరుగుతున్నట్లు అనిపించింది. తరువాత ఏమైందో నాకు గుర్తు లేదు అని కేటీ సాల్మన్ పోలీసులకు తెలిపారు.

అర్ధరాత్రి దాటిన తర్వాతే సంఘటన

అర్ధరాత్రి దాటిన తర్వాతే సంఘటన

అర్థరాత్రి 2.30 గంటల తర్వాతే ఆమెపై రేప్(అనుమానం) జరిగినట్లు స్పష్టం అవుతోంది. పోలీసులు సేకరించిన వివరాల ప్రకారం కేటీ సాల్మన్, ఆమె స్నేహితురాలు, డేనియల్ కలిసి అర్దరాత్రి దాటిన తర్వాత 2.30 గంటల ప్రాంతంలో నైట్ క్లబ్ నుంచి బయటికి వెళ్లిపోయినట్లు సిసి టీవీల్లో రికార్డయింది. కేటీ సాల్మన్ అతనితో ఉండటంతో స్నేహితురాలు జెస్సికా అక్కడి నుండి వెళ్లిపోయింది.

మెళకువ వచ్చేసరికి అంతా అయిపోయింది?

మెళకువ వచ్చేసరికి అంతా అయిపోయింది?

ఆమె మత్తు నుండి తేరుకునే సమయానికే అంతా అయిపోయింది. మెళకువ వచ్చే సమయానికి తెల్లవారుఝామున నైట్ క్లబ్ కు కొంతదూరంలో గాయాలపాలై, తాను అత్యాచారానికి గురైనట్లు(అత్యాచారం జరిగిన విషయం కూడా గుర్తు లేదు) ఉన్న ఆనవాళ్ళతో తన స్థితిని చూసి తానే షాకైంది.

అవికూడా దోచుకుపోయాడు

అవికూడా దోచుకుపోయాడు

తన అభిమానిగా చెప్పుకున్న డేనియల్ అనే వ్యక్తి ఆమె హ్యాండ్ బ్యాగ్, మొబైల్ ఫోన్ కూడా ఎత్తుకెళ్లాడు. అత్యాచారం జరిగిన విషయం తనకు గుర్తు లేదని కేటీ సాల్మన్ పోలీసులకు తెలిపారు. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Katie Salmon
English summary
Katie Salmon has opened up about her terrifying ordeal at the hands of a stranger who spiked her with date rape drug and robbed her.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu