»   » నిన్న గుడ్డలూడదీసింది..నేడు ఏనుగు ఎక్కింది..మరి రేపు..

నిన్న గుడ్డలూడదీసింది..నేడు ఏనుగు ఎక్కింది..మరి రేపు..

Subscribe to Filmibeat Telugu

ప్రముఖ సింగర్ క్యాటీ పెర్రీ ఏది చేసినా వెరయిటీగా చెయ్యాలని అనుకుంటుంది. ఆమె విపరీత క్షమించాలి వెరయిటీ బుర్రకు ఏది తోచితే అది చేసేస్తుందట. ఇంతకు ముందు ఓ పార్టీకి వెరయిటీ కోసమని ఒంటి మీద నూలు పోగు లేకుండా వెళ్లి అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసిన ఆమె ఈ దఫా ఏనుగు మీద ఊరేగింది. గత శనివారం జరిగిన సెలబ్రటీ బ్లాగర్ పిరెజ్ హిల్టన్ పుట్టినరోజు వేడుకకు అందరూ ఖరీదయిన వెరయిటీ కార్లలో వేంచేస్తే ఈ వెరయిటీ మారాణి మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఏనుగు మీద ఆ పార్టీకి వెళ్లిందట.

ఇక ఈ పార్టీలో వున్న వారు మాత్రం ఈమె వెరయిటీ డ్రస్సును.. వెరయిటీ వాహనాన్ని చూసి తెగ చెవులు కొరుక్కున్నారట. ఏంటి క్యాటీ ఇది అందరూ నీ గురించి ఇలా అనుకుంటుంటే నువ్వేంటిలా చేస్తున్నావు అంటే మాత్రం నా వెరయిటీ నా ఇష్టం మీకేంటి అన్నట్టుగా ఓ వెరయిటీ ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu