భర్త నుండి విడాకులు, వేరొకరితో డేటింగ్ ప్రారంభం
హాలీవుడ్ పాప్ స్టార్ కాటీ పెర్రి ప్రెంచ్ మోడల్ 'బాప్టిస్ట్ గియాబికోని'తో డేటింగ్ చేస్తుందంటూ రూమర్స్ హాల్ చల్ చేస్తున్నాయి. 27 సంవత్సరాల వయసు కలిగిన కాటీ పెర్రీ ఇటీవల ప్రేమించే పెళ్లి చేసుకున్న బ్రిటీష్ కమెడియన్ రస్సెల్ బ్రాండ్‌తో 14 నెలలు అతనితో జీవించి ఆ తర్వాత కొన్ని మనస్పర్దలు రావడం వల్ల విడాకులు తీసుకున్నారు. వీరిద్దరూ భారతదేశంలో సాంప్రదాయబద్దంగా వివాహాం చేసుకున్న విషయం తెలిసిందే.
తన భర్త నుండి కాటీ పెర్రి విడిపోయిన తర్వాత గతంలో తనని ఎంతగానో ప్రేమించిన ప్రెంచ్ మోడల్ 'బాప్టిస్ట్ గియాబికోని'తో పారిస్ హోటల్స్లో చక్కెర్లు కొడుతుందని వీరిద్దరి చూసిన వారు అంటున్నారు. అంతేకాకుండా ప్రేమలో పడిన కొత్త జంట ఎలాగైతే ఉంటుందో అలానే చెట్టాపట్టాలేసుకోని వీరిద్దరూ పారిస్ వీధులన్నీ తిరిగారని వీక్షకులు తెలిపారు.
22 సంవత్సరాల వయసు కలిగిన ప్రెంచ్ మోడల్ 'బాప్టిస్ట్ గియాబికోని' కాటీ పెర్రీ తన మాజీ భర్త నుండి విడాకులు తీసుకోవడంతో తాను పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేశాడు. కాటీ పెర్రీని తాను ఏమాత్రం బలవంతం చేయనని అన్నాడు. తనంటే నాకు మొదటి నుండి చాలా ఇష్టం. కాకపోతే తాను ఇష్టపడి రస్సెల్‌ని పెళ్లి చేసుకుంది కాబట్టి నేను తప్పుకున్నానని అన్నాడు.


Click it and Unblock the Notifications











