»   » కాబోయే భార్య ఫోటో తీసినందుకు ఫోటోగ్రాఫర్ చెంప చెళ్శుమనిపించిన హీరో..!

కాబోయే భార్య ఫోటో తీసినందుకు ఫోటోగ్రాఫర్ చెంప చెళ్శుమనిపించిన హీరో..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

రస్సెల్ బ్రాండ్ ఇటీవల ఒక వివాదంలో చిక్కుకున్నారు. అదేంటంటే తనకు కాబోయే భార్య హాలీవుడ్ సూపర్ సింగర్ కాటి పెర్రి స్కట్ ని ఫోటో తీయబోయిని ఫోటోగ్రాఫర్ పై చేయిచేసుకున్నాడు. దీనిపై అతని మీద లాసూట్ లో కేసు నమోదు చేయబడింది.

విషయం ఏమిటంటే రస్సెల్ బ్రాండ్ మరియు కాటి పెర్రి ల మధ్య గత కొంత కాలంగా ప్రేమ వ్యవహారం కోనసాగుతుంది. అంతేకాకుండా చాలా కాలం నుండి వీరు డేటింగ్ కూడా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. దానితో వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. డెల్టా సెక్యూరిటి సహాయంతో షాపింగ్ వెళ్తున్న సమయంలో కొంతమంది ఫోటోగ్రాఫర్స్ కాటి పెర్రి వేసుకున్న స్కట్ ని ఫోటో తీయడానికి ప్రయత్నించగా వారిపై రస్సెల్ బ్రాండ్ చేయిచేసుకోవడం జరిగింది. ఈ విషయంపై కాటిపెర్రి స్పందిస్తూ ఎవరైనా వాళ్శ లిమిట్స్ లో ఉంటే మంచింది. అంతేకాకుండా కెమెరా నా డ్రస్సు పైకి తెచ్చి మరీ ఫోటోలు తీస్తే ఇలానే జరుగుతుందని రస్సెల్ బ్రాండ్ కూడా అందుకే అలా చేశాడని ఆమె వివరించారు. ఇందులో రస్సెల్ బ్రాండ్ తప్పుఏమి లేదని ట్విట్టర్ లో తన అభిమానులకు తెలియజేశారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu