twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అభిమానులందరూ చూస్తుండగా.. బుగ్గపై ముద్దు

    By Nageswara Rao
    |

    లండన్, జులై 3: ప్రక్క చిత్రంలో మీరు చూస్తున్న ఫోటో హాలీవుడ్ పాప్ సింగర్ 'కాటి పెర్రీ ' ఓ అభిమాని చేత తన బుగ్గ మీద ముద్దు పెట్టించించుకుంటున్న ఫోటో. ఇటీవల కాటి పెర్రీ నటించిన 'కాటి పెర్రీ: పార్ట్ ఆఫ్ మి' సినిమా ప్రమోషన్‌లో భాగంగా లండన్ ప్రీమియర్‌‌లో ఫన్నీ సన్నివేశం జరిగింది. తన అభిమానుల కోసం కాటి పెర్రీ ఏమైనా చేయడానికి సిద్దం అనేది ఈ ఫోటో ద్వారా మరోసారి రుజువైంది.

    నృత్య కళాకారిణి-శైలి దుస్తులు ధరించి తన అందాలతో హోయలు ఒలికిస్తూ రెడ్ కార్పెట్‌పై నడిచి వస్తుండగా.. ఓ అబ్బాయి ఆటోగ్రాఫ్ కావాలని పెర్రీ అడగడంతో, ఆ అబ్బాయి వద్దకు వెళ్లి కాసేపు ముచ్చటించి అతని చేత బుగ్గపై ముద్దు పెట్టించుకోని అక్కడున్న అభిమానులు అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. 27 సంవత్సరాల వయసు కలిగిన కాటి పెర్రీ ఈ సినిమా ప్రమోషన్ కోసం చాలా కష్టపడుతుంది. ఈ కార్యక్రమం అంతా లెస్టర్ స్క్వేర్‌లో ఎంపైర్ థియేటర్‌లో జరిగింది.

    కాలిఫోర్నియా సింగరైన కాటి పెర్రీ తన కళ్లకు యూనియన్ జాక్ ఫేక్ ఐలాసెస్‌ను ధరించించింది. ఎవరైతే కాటి పెర్రీని దగ్గరగా చూసే అవకాశాన్ని పొందారో వారికి మాత్రమే ఇది కనిపించింది. తొలుత ఈ సినిమా ప్రమోషన్‌ని బ్రెజిల్ చేసింది. ఆ తర్వాత ఇప్పుడు లండన్‌లో.. ఐతే లండన్‌లో కాటి పెర్రీ అభిమానులు చూపించిన అభిమానానికి మంత్ర మగ్దురాలైంది.

    36 సంవత్సరాలు వయసు కలిగిన రస్సెల్ బ్రాండ్ గత డిసెంబర్‌లో ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్య కాటి పెర్రీ నుండి విడాకులు తీసుకున్నాడు. రస్సెల్ బ్రాండ్, క్యాటీ పెర్రీ నుండి విడాకులు కోరడానికి గల కారణం తెలుసుకుంటే మాత్రం ఆశ్చర్య పోవాల్సిందే. రస్సెల్ బ్రాండ్‌కి పిల్లలంటే చచ్చేంత ఇష్టమట. తన భార్యతో మనం ఫ్యామిలీని స్టార్ట్ చేద్దాం అని కోరగా, అందుకు క్యాటీ పెర్రీ అంగీకరించ లేదు. దీనికి గాను రస్సెల్ బ్రాండ్, భార్య నుండి విడాకులు తీసుకున్నాడు. రస్సెల్ బ్రాండ్, క్యాటీ పెర్రీ ఇద్దరూ ప్రేమించుకోని 2010లో అంగరంగ వైభవంగా ఇండియాలో వివాహాం చేసుకున్నారు. వీరిద్దరి పెళ్లి జరిగి కనీసం 14నెలలు కాక ముందే డిసెంబర్ 30, 2011న తామిద్దరం విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

    తెలుగు వన్ఇండియా

    English summary
    But tonight, it was a case of I Kissed A Boy as Katy Perry made one young fan's day as she graciously received a kiss on the cheek. The singer made a beeline for the little boy as she walked down the pink carpet at the European premiere of her warts and all film, Katy Perry: Part Of Me in London.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X