»   » చిన్న పిల్లల పంక్షన్ కి స్కట్ తో వచ్చి నవ్వుల పాలైన సింగర్..!

చిన్న పిల్లల పంక్షన్ కి స్కట్ తో వచ్చి నవ్వుల పాలైన సింగర్..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

క్యాటీ పెర్రీ కి వివాదాలు అంటే భలే సరదా.. మొన్నా మధ్య తన బాయ్ ప్రెండ్ మరియు కాబోమే భర్త రస్సెల్ బ్రాండ్ తో ఆఫ్ స్కట్ వేసుకోని బయటకు వచ్చినప్పుడు ఫోటో తీయబోతున్న ఫోటో గ్రాఫర్ మీద చేయిచేసుకోని వార్తల్లో కెక్కారు. ఇప్పుడు కొత్తగా చిన్న పిల్లల ఈవెంట్ కి లో కట్ స్కట్ వేసు కోచ్చి మరలా వివాదాల్లో నిలిచింది. శనివారం సెసమి వీధిలో జరిగినటువంటి నైట్ లైవ్ లో ఆమె వేసుకోచ్చినటువంటి డ్రస్సు పెద్ద దుమారం లేపింది.

ఈ 25సంవత్సరాల సుందరిని షెడ్యూల్ ప్రకారం రెండు ట్రాక్స్ యే పాడవల్సి ఉండగా, ఈ చిన్న పిల్లలు డ్రామాలో ఆమె డ్రస్సు వివాదాస్పదమైంది. ఈ ఈవెంట్ కి 16సంవత్సరాల వయసుగల చిన్న అమ్మాయిలా రావడం జరిగింది. ఈ ఈవెంట్ ని జరిపేవారు క్యాటీ పెర్రీని ఏమైంది నీ స్కట్ కి, ఈరోజు జరుగుతున్నటువంటి షో లో అందరూ నీ డ్రస్సు గురించే మాట్లాడుకుంటున్నారు. కనీసం నీ బ్రెస్ట్ ని కూడా సరిగా కప్పకోలేదంట అని అనడం అనడంతో ఆగ్రహించిన సింగర్ కాటి పెర్రి ఒక పక్కకు వెళ్శి కూర్చోని చూయింగ్ గమ్ తింటూ తన జుట్టుతో ఆడుకుంటూ పార్టీ అయ్యేంత వరకూ గడిపిందని సమాచారం. గతంలోకూడా బ్రిటీష్ కు చెందిన కమేడియన్ రస్సెల్, క్యాటీ పెర్రీ ఓ వింత ఆలోచనకి శ్రీకారం చుట్టారు. నగ్నత్వం మధ్య పెళ్లిచేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

తమ పెళ్లికి వచ్చేవారందరూ నగ్నంగానే రావాలని షరతు పెట్టిన వారు తాము కూడా నగ్నంగానే వుంటామని ప్రకటించారు. దీంతో వీరిద్దరి పెళ్లి వార్త విని సంతోషపడ్డ వారి సన్నిహితులు, అథితులు వాళ్లు పెట్టిన షరతును విని బిక్కమొహం వేసిన సంగతి మనకు తెలిసిందే.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu