twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాతో ప్రేమలో పడిన తర్వాత అతను చాలా మారిపోయాడు..

    By Nageswara Rao
    |

    భారతదేశం సంప్రదాయపద్దతిలో పెళ్శిచేసుకున్నటువంటి రస్సెల్ బ్రాండ్ మరియు కాటిపెర్రి పెళ్శి అయిన తర్వాత మొట్టమొదటసారి మీడియా ముందు కనపడి వారి మనోభావాలను వెల్లడించడం జరిగింది. హార్పర్స్ బజార్ అనే మ్యాగజైన్ కుఇచ్చినటువంటి ఇంటర్యూలో ఒకరిగురించి మరోకరు వారి ప్రేమను వెలిబుచ్చారు. ఈసందర్బంలో కాటిపెర్రి మాట్లాడుతూ హార్పర్స్ మ్యాగజైన్ కుఇంటర్యూ ఇవ్వడానికి కారణం డిసెంబర్లో నేను కవర్ పేజిపై దర్శనమివ్వడమేనని అన్నారు. నాజీవతంలో నాకు దేవుడుఇచ్చినటువంటి భర్తగా నేను రస్సెల్ బ్రాండ్ నిభావిస్తున్నా అని అన్నారు.

    తను ప్రేమించడం లో మానాన్నలాగే అని అన్నారు. మేమిద్దరం విభన్న ప్రాంతాలకు చెందిన వారిమైనా ఇప్పటినుంటి జీవితంలో కలసిమెలసి జీవించాలని కోరుకుంటున్నాం. నన్ను ఎప్పుడూ నవ్వించాలనే ప్రయత్నం చేస్తుంటాడు అందుకే అతనంటే ఇష్టం అంటున్నారు సింగర్ కాటిపెర్రి. కాని రస్సెల్ బ్రాండ్ మాత్రం కాటిపెర్రి గురించి మాట్లాడుతూ కాటిపెర్రి చాలా మంచి అమ్మాయని, అందం మాత్రమే కాకుండా దయ కూడా చాలా ఎక్కువ అని అన్నారు. దీనిపై స్పందించిన కాటిపెర్రి నేను చాలా మంచి అమ్మాయిని కావడానికి కారణం నేను ప్రేమను నమ్ముతాను, ఎదుటివారిని గౌరవిస్తానని అన్నారు అందుకే కాబోలు రస్సెల్ నన్ను మంచి అమ్మాయి అని అన్నారు.

    కాటిపెర్రి మాట్లాడుతూ నాపాటల వల్ల నేను ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాను. అందుకే నన్ను వీధిలో అమ్మాయి అని అంటారు. కాని నేను బెడ్ మీద చాలా వెరైటీగా ప్రవర్తిస్తానని అన్నారు. నాకు నేనుగా రేటింగ్ ఇచ్చుకోలేను. అదే మీరు రస్సెల్ నిగనుగ అడిగినట్లైతే తను మాత్రం నాకు పదికి పది రేటింగ్ ఇస్తాడు, దానికి కారణం నాగురించి అంత బాగా తెలుసు రస్సెల్ కి. పెళ్శికి ముందు మేము ఒప్పందం చేసుకున్నటువంటి అగ్రిమెంట్ గురించి మాకు ఎటువంటి ఇబ్బందిలేదన్నారు. అగ్రిమెంట్ లోపెళ్శి అయిన తర్వాత మేము నైట్ క్లబ్బులకు వెళ్శరాదని నిర్ణయించుకోవడం మరియు పాత బాయ్ ప్రెండ్ తో మాట్లాడడం లాంటి నిబంధలను విధించుకున్న విషయం తెలిసిందే.

    నన్ను రస్సెల్ ప్రేమించిన తర్వాత తన వద్దనున్నటువంటి అన్ని సీక్రెట్స్ నునాకు చెప్పడం జరిగింది. నాతో ప్రేమలో పడిన తర్వాత రస్సెల్ చాలా మారిపోయాడని అన్నారు. ఇలాగే కలకాలం మేము కలసి ఉండాలని అనుకుంటున్నామని అన్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X