సెక్సీ సింగర్‌తో రూ. 16 కోట్ల డీల్ (హాట్ పిక్చర్స్)
లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ హాట్ లేడీ, సెక్సీ సింగర్ కాటి పెర్రితో ఓ సంస్థ కుదుర్చుకున్న డీల్ ఇప్పుడు చర్చనీయాంశం అయింది. ఓ పబ్లిషకేషన్ సంస్థ ఆమె ఆటో బయోగ్రఫీ(ఆత్మకథ) ప్రచురించడం కోసం 2 మిలియన్ పౌండ్స్(రూ. 16 కోట్లు) చెల్లించేందుకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.
28 ఏళ్ల ఈ హాట్ సుందరి 'పార్ట్ ఆఫ్ మి' అనే పేరుతో తన ఆటో బయోగ్రఫీని విడుదల చేయబోతోంది. ఈ పుస్తకంలో ఆమె జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు, బ్రిటిష్ కమెడియన్ రస్సెల్ బ్రాండ్‌తో ఆమె పెళ్లి, విడాకులకు దారితీసిన పలు అంశాలు... సంచలనం రేకెత్తించే పలు సీక్రెట్స్ ఉండనున్నాయట.
కాటి పెర్రి మాజీ భర్త రస్సెల్స్ కూడా ఓ పుస్తకం విడుదల చేస్తున్నారు. అందులో వన్ సైడ్ విషయాలు మాత్రమే ఉండనున్న నేపథ్యంలో...తను కూడా ఆత్మకథ పేరుతో పుస్తకం విడుదల చేయాలని నిర్ణయించుకుంది ఈ హాట్ లేడి. అన్ని కోట్లు గుమ్మరించారంటే మరి ఈ పుస్తకంలో ఎన్ని సంచలనాలు ఉండబోతున్నాయో?

కాటి పెర్రీ కాలిఫోర్నియాలో జన్మించారు. చిన్నతనం నుండే ఆమెకు సంగీతంపై ఆసక్తి ఉండేది.

ఆమె ఆల్బమ్స్ కు ప్రపంచ వ్యాప్తంగా మంచి గిరాకీ ఉంది.

తన భర్త నుండి విడాకులు తీసుకున్న తర్వాత రెండు నెలలు పాటు ప్రముఖ గిటారిస్ట్ జాన్ మేయర్‌తో డేటింగ్ చేసింది.

ఆ తర్వాత ఆమె రాబర్ట్ ప్యాటిన్సన్‌తో కలిసి తిరగడం కూడా ఆ మధ్య చర్చనీయాంశం అయింది.

ఆమె ఆల్బమ్స్‌కు పలు సార్లు ప్రఖ్యాత గ్రామీ అవార్స్ దక్కాయి.

ఇప్పటి వరకు కాటి పెర్రీకి సంబంధించిన 11 మిలియన్ల ఆల్బమ్స్, 75 మిలియన్ల డిజిటిల్ ట్రాక్స్ అమ్ముడయ్యాయి.

గాయినిగానే కాదు.... సెక్సీ లేడీగా కూడా కాటి పెర్రి పేరు తెచ్చుకుంది.

సంపాదన విషయంలోనూ కాటిపెర్రీ ముందుంది. 2011లో ఆమెకు ‘బిల్ బోర్డ్స్'లో 14వ స్థానం దక్కింది.

వీనుల విందైన సంగీతం వినిపించడంతో పాటు.... హాట్ సెక్సీగా అందాలు ఆరబోయడం కాటిపెర్రి స్పెషల్.

కాటి పెర్రి ఆటోబయోగ్రఫీ విడుదలైన తర్వాత ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











