Don't Miss!
- Finance Gold Price: షాకిస్తున్న బంగారం ధర.. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన గోల్డ్ ప్రైస్..
- News ఎస్..ఇదే కడప, రాయలసీమ కల్చర్ - సీఎం జగన్..!!
- Automobiles వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
విడిపోయినా నాకు ఫ్యాన్స్ సపోర్ట్ ఉంది..!
హాలీవుడ్ కమెడియన్ రస్సెల్ బ్రాండ్ తన భార్య సింగర్ కాటి పెర్రీకి తనతో పిల్లలను కనేందుకు సహాకరించడం లేదని ఇటీవల విడాకులు కోరిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న కాటి పెర్రీ అభిమానులు ఆమెకు బాసటగా నిలిచారు. ఈ విషయంపై కాటి పెర్రీ మాట్లాడుతూ నేను కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నా అభిమానులు నాపై చూపిన ప్రేమకు నేను కృతజ్ఞరాలునై ఉంటానని అన్నారు.
అభిమానులు తిరిగి మరలా నేను ఆనందంగా ఉండేందుకు సహాకరించారని అన్నారు. వారి రుణం ఈ జన్మలో తీర్చికోలేదని ట్విట్టర్లో తన అభిమానులపై ఉన్న ప్రేమాభిమానాలను ట్వీట్ చేశారు. 27 సంవత్సరాల వయసు కలిగిన కాటి పెర్రీ సింగర్‌గా హాలీవుడ్లో మంచి పేరు తెచ్చుకోవడమే కాకుండా, ఎన్నో గొప్ప అవార్డులను సొంతం చేసుకున్నారు. రస్సెల్ బ్రాండ్, కాటి పెర్రీ ఇద్దరూ కూడా జూన్ 18న ఇండియా సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు.
సింగర్ రిహానా మాట్లాడుతూ తన 14 నెలలు కలసి జీవించిన తర్వాత తన భర్త బ్రిటిష్ కమెడియన్ రస్సెల్ బ్రాండ్ నుండి ఎందుకు విడిపోవాల్సి వచ్చిందో అందుకు గల కారణాలను పెర్రి ఫోన్ చేసి మరీ నాతో పంచుకుందని అన్నారు.
ప్రస్తుతం తాను ఉన్న పరిస్దితులలో ఎవరితో కూడా మాట్లాడేందుకు ఇష్టపడడం లేదు. అసలు వీరిద్దరూ విడిపోవడానికి గల కారణాన్ని తెలుసుకుంటే మాత్రం ఆశ్చర్య పోవాల్సిందే. రస్సెల్ బ్రాండ్‌కి పిల్లలంటే చచ్చేంత ఇష్టం అంట. తన భార్యతో మనం ఫ్యామిలీని స్టార్ట్ చేద్దాం అని కోరగా, అందుకు క్యాటీ పెర్రీ అంగీకరించ లేదు. దీనికి గాను రస్సెల్ బ్రాండ్, భార్య నుండి విడాకులు తీసుకునేందుకు సిద్దమయ్యాడని సమాచారం.