twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విడిపోయినా నాకు ఫ్యాన్స్ సపోర్ట్ ఉంది..!

    By Nageswara Rao
    |

    హాలీవుడ్ కమెడియన్ రస్సెల్ బ్రాండ్ తన భార్య సింగర్ కాటి పెర్రీకి తనతో పిల్లలను కనేందుకు సహాకరించడం లేదని ఇటీవల విడాకులు కోరిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న కాటి పెర్రీ అభిమానులు ఆమెకు బాసటగా నిలిచారు. ఈ విషయంపై కాటి పెర్రీ మాట్లాడుతూ నేను కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నా అభిమానులు నాపై చూపిన ప్రేమకు నేను కృతజ్ఞరాలునై ఉంటానని అన్నారు.

    అభిమానులు తిరిగి మరలా నేను ఆనందంగా ఉండేందుకు సహాకరించారని అన్నారు. వారి రుణం ఈ జన్మలో తీర్చికోలేదని ట్విట్టర్‌లో తన అభిమానులపై ఉన్న ప్రేమాభిమానాలను ట్వీట్ చేశారు. 27 సంవత్సరాల వయసు కలిగిన కాటి పెర్రీ సింగర్‌గా హాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకోవడమే కాకుండా, ఎన్నో గొప్ప అవార్డులను సొంతం చేసుకున్నారు. రస్సెల్ బ్రాండ్, కాటి పెర్రీ ఇద్దరూ కూడా జూన్ 18న ఇండియా సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు.

    సింగర్ రిహానా మాట్లాడుతూ తన 14 నెలలు కలసి జీవించిన తర్వాత తన భర్త బ్రిటిష్ కమెడియన్ రస్సెల్ బ్రాండ్ నుండి ఎందుకు విడిపోవాల్సి వచ్చిందో అందుకు గల కారణాలను పెర్రి ఫోన్ చేసి మరీ నాతో పంచుకుందని అన్నారు.

    ప్రస్తుతం తాను ఉన్న పరిస్దితులలో ఎవరితో కూడా మాట్లాడేందుకు ఇష్టపడడం లేదు. అసలు వీరిద్దరూ విడిపోవడానికి గల కారణాన్ని తెలుసుకుంటే మాత్రం ఆశ్చర్య పోవాల్సిందే. రస్సెల్ బ్రాండ్‌కి పిల్లలంటే చచ్చేంత ఇష్టం అంట. తన భార్యతో మనం ఫ్యామిలీని స్టార్ట్ చేద్దాం అని కోరగా, అందుకు క్యాటీ పెర్రీ అంగీకరించ లేదు. దీనికి గాను రస్సెల్ బ్రాండ్, భార్య నుండి విడాకులు తీసుకునేందుకు సిద్దమయ్యాడని సమాచారం.

    English summary
    Singer Katy Perry has thanked her fans for their love and support while she was coping with her split from husband Russell Brand.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X