ప్రారంభోత్సవంలో మంత్ర ముగ్దుల్ని చేసిన 'పెర్రీ'
ఇండియాలో ఖరీదైన టోర్నమెంట్‌గా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ప్రారంభోత్సవ కార్యక్రమం అటు బాలీవుడ్ స్టార్ హీరోలు, ఇటు హాలీవుడ్ పాప్ సింగర్ కాటి పెర్రీల డ్యాన్స్‌లతో అంగరంగ వైభవంగా జరిగాయి. ఐపిఎల్ ప్రారంభోత్సవ కార్యక్రమం చెన్నైలోని వైఎంసిఎ ఫిజికల్ క్రికెట్ గ్రౌండ్‌లో క్రికెట్ అతిరధ మహారధులతో పాటు 9 ఐపిఎల్ జట్ల కెప్టెన్లు, టీమ్ సభ్యులు పాల్గోన్నారు.
ఐపిఎల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేయనున్న తరుణంలో హాలీవుడ్ పాప్ సింగర్ కాటి పెర్రీకి మంచి ప్రచారం లభించింది. 27 సంవత్సరాల వయసు కలిగిన కాటి పెర్రీ ఇటీవల తన భర్త, బ్రిటిష్ కమెడియన్ రస్సెల్ బ్రాండ్ నుండి విడాకులు తీసుకున్నప్పటికీ ఆ ఛాయలు ఏమాత్రం కనిపించకుడా తన ఫెర్పామెన్స్‌ని కనబర్చింది. తన ఫెర్పామెన్స్ మధ్యలో ప్రేక్షకులను ఊర్రూతలూగించేందుకు గాను ఆసీస్ బౌలర్, చెన్నై సూపర్ కింగ్స్ ఫేసర్ బొలింజర్ తో ఆడి పాడింది.
సాధారణంగా హాలీవుడ్ పాప్ సింగర్స్ స్టేజీలపై ఫెర్పామెన్స్‌లు ఇచ్చేటప్పుడు వారు వేసే డ్రస్సులలో కొంచెం వల్గారిటీ కనిపిస్తుంది. కానీ ఐపిఎల్ ప్రారంభోత్సవంలో మాత్రం కాటి పెర్రి తనదైన శైలిలో నెమలి మాదిరి డ్యాన్స్ చేస్తుంటే యావత్ భారతావని పులకరించింది. తనను పాపులర్ చేసిన ఫైర్‌వర్క్స్, కాలిఫోర్నియా గర్ల్స్ పాటలకు ఆడి పాడిన పెర్రీ కొద్ది సేపు మైదానంలో జోష్ తెచ్చింది. ముఖ్యంగా విదేశీ క్రికెటర్లు ఆ కాసేపు పెర్రీ పెర్ఫార్మెన్స్‌ను ఎంజాయ్ చేశారు.


Click it and Unblock the Notifications











