ఇక నుంచి నాపేరులో నాభర్త పేరుకూడా కలవనుందని చెప్పిన సింగర్..
సాధారణంగా పెళ్శి చేసుకున్న తర్వాత భర్త ఇంటి పేరు భార్యకు వర్తిస్తుంది. హాలీవుడ్ లోమాత్రం కొందరు హీరో, హీరోయిన్లు పెళ్శి చేసుకున్న తర్వాత వాళ్శ భర్త పేరుని తనపేరు ప్రక్కన పెట్టుకోవడం చూసేఉంటాం. ఇందుకు ఉదాహారణగా హాలీవుడ్ అందాలజంట బ్రాడ్ పిట్ మరియు ఏంజిలీనా జోలి జంటను అందరూ బ్రాంజిలినా అని పిలవడం మనకు తెలిసిందే. ముఖ్యంగా బ్రాడ్ పిట్ నుఏంజిలీనా జోలి పెళ్శి చేసుకున్న తర్వాత ఏంజిలీనా జోలి అభిమానులు జోలిని బ్రాడ్ పిట్ తోకలిపి బ్రాంజిలినా పిలవడం అందరికి తెలిసిందే.
ఇప్పుడు ఇదే వరుసలోకి రాబోతున్నారు మన సింగర్ కాటిపెర్రి. భారతదేశం సాంప్రదాయ పద్దతిలో పెళ్శి చేసుకున్న కోత్త పెళ్శి జంట కాటిపెర్రి మరియు రస్సెల్ బ్రాండ్. వీరిద్దరూ రాజస్టాన్ లోని రాంబాగ్ ప్యాలెస్ లోపెళ్శి చేసుకున్న అందరికి తెలిసిందే. ఈపెళ్శికి అతిరధ మహారధులు అందరూ హాజరయిన విషయం కూడా మనకు తెలుసు. సంప్రదాయపద్దతిలో పెళ్శిచేసుకున్నటువంటి రస్సెల్ బ్రాండ్ మరియు కాటిపెర్రి పెళ్శి అయిన తర్వాత మొట్టమొదటసారిగా మాడ్రిడ్ లో జరుగుతున్న యమ్ టివి యూరప్ మ్యూజిక్ అవార్డులు విచ్చేసి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తారు.
ఈసందర్బంలో సింగర్ కాటిపెర్రి తన పేరుని కూడా కాటి బ్రాండ్ గామార్చుకోవాలని తెలియజేశారు. దీనికి సంబంధించి లీగల్ ప్రాసెస్ అంతా కంప్లీట్ కావచ్చిందని తెలిపారు. త్వరలోనే కాటిపెర్రి కాస్త మిస్టర్స్ కాటి బ్రాండ్ గామారనుందని విలేకరులకు తెలియజేశారు.


Click it and Unblock the Notifications











