హాలీవుడ్ ప్రేమ జంట పెళ్శికి ఇండియా కిరీటం...
హాలీవుడ్ ప్రేమ జంట కాటి పెర్రి మరియు రస్సెల్ బ్రాండ్ ప్రస్తుతం చురుగ్గా పెళ్శి పనులు చూసుకుంటున్నారు. ఇటీవల కాలంలో పెళ్శిచేసుకున్న జంట హైదిక్లూమ్, గ్వెన్ స్టీఫానీ వారికి సంబంధించినటువంటి పెళ్శి పనులు బాధ్యతను టిన్ సెల్ టౌన్ వెడ్డింగ్ డిజైనర్ మిండి వెయిస్ కి అప్పజెప్పిన విషయం అందరికి తెలిసిందే. హైదిక్లూమ్, కాటి పెర్రికి మంచి స్నేహితురాలు.
వచ్చే నెలలో జరగనున్న వీరి పెళ్శి అంగరంగ వైభవంగా చేయడానికి నిర్ణయించుకున్న కాటిపెర్రి పెళ్శి పనులు బాధ్యతను మిండి వెయిస్ కి అప్పజెప్పారు. అంతేకాకుండా పెళ్శిని ఓ సాంప్రదాయ పద్దతి లో చేయనున్నట్లు వివరించారు. పెళ్శికి సంబంధించినంతవరకు పెళ్శి కూతురు చేతికి ఇండియా మెహాంది మరియు ఇండియా కిరీటం తేనున్నారని మిండి తెలిపారు. ఈ విషయం పై కాటిపెర్రి చాలా ఆనందంగా ఉన్నట్టు వివరించారు. మొత్తానికి హాలీవుడ్ పెళ్శి లో మన ఇండియా సాంప్రదాయాలు పాటిస్తుండడం పట్ల మనం ఒకింత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయకతప్పదు. దానికి కారణం మన ఇండియా సాంప్రదాయాలు దేశదేశాలను దాటి ఎక్కడికో వెళుతున్నాయి కాబట్టి.


Click it and Unblock the Notifications











