Johnwick 4: యాక్షన్ హీరో జాన్ విక్ వచ్చేస్తున్నాడు... స్ట్రీమింగ్ ఎందులో అంటే..
జాన్ విక్... హాలీవుడ్ సినిమాలు రెగ్యులర్ గా ఫాలో అయ్యే ప్రేక్షకులకు పరిచయమైన పేరే. ఈ హాలీవుడ్ సూపర్ హిట్ ఫ్రాంఛైజీలో 4వ సీజన్ జాన్ విక్ 4 సినిమా మార్చి 24 వ తేదీన రిలీజ్ అయి ఆకట్టుకుంది. 2019 లో వచ్చిన జాన్ విక్ 3 సిరీస్ కు కొనసాగింపుగా ఈ సినిమా వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం అయితే కురిపించింది.
అన్ని సీజన్ల కంటే ఈ సీజన్ కు ప్రేక్షక ఆదారణ అయితే ఎక్కువగానే లభించింది. ఇక ఈ చిత్రంలో కిన్ రివ్స్, డానీ యెన్, లారెన్స్ ఫిష్‌బర్న్, రినా సవాయామా, మ్యాక్ షేన్, షామీర్ అండర్సన్ తదితరులు నటించారు. అయితే తాజాగా ఈ సినిమా డిజిటల్ ప్రిమియర్ రిలీజ్ డేట్ ను ఖరారు చేసుకుంది. ఈ సినిమా లైయన్స్ గేట్ ప్లే ఓటీటీ ఫ్లాట్ ఫారంలో జూన్ 23 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఇక ఈ సిరీస్ కు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. వారికి ఈ న్యూస్ పండగే అని చెప్పవచ్చు.

థియేటర్లలో చూసి ఎంజాయ్ చేసిన వారితో పాటుగా... చూడని వారు ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయవచ్చు. చాడ్ సాహెల్స్కి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. అతను స్టంట్ మాన్ కూడా. జాన్ విక్ ఫ్రాంఛైజీలో ప్రతి సీన్, యాక్షన్ ఎపిసోడ్ ప్రత్యేకంగా డిజైన్ చేశారనే చెప్పవచ్చు.
ఇక ఈ సినిమా విషయానికి వస్తే... మొత్తం 2 గంటల 50 నిమిషాల సుదీర్ఘ నిడివితో ఉన్న ఈ రేసీ థ్రిల్లర్ లో ప్రతిపావు గంటకు మతిపోగోట్టే రీతిలో ఫైట్లు ఛేజులు వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా చివరి నలభై అయిదు నిమిషాలు చూపు పక్కకు తిప్పుకోవడం కష్టమే. లాజిక్స్ ని గాలికి వదిలేసి జాన్ విక్ విన్యాసాలు చూస్తూ ఉంటే టైం ఇట్టే గడిచిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు ఓటీటీలోకి వచ్చాక ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయండి.


Click it and Unblock the Notifications











