John Wick: Chapter 4 విడుదలకు సిద్దం.. ఇండియాలో రిలీజ్ ఎప్పుడంటే?
ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకొన్న జాన్ విక్ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఈ సిరీస్‌లో నటించిన యాక్టర్ కీను రీవ్స్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. ఈ వెబ్ సిరీస్ కోసం ఏ రకంగా కష్టపడ్డాం. ఎలాంటి ఛాలెంజ్‌లను ఎదుర్కొన్నమనే విషయాన్ని వెల్లడించారు. జాన్ విక్ ఫ్రాంచైజీలో భాగంగా 4 సీజన్ ఇండియాలో మార్చి 24వ తేదీన రిలీజ్‌కు సిద్దమైంది. ఈ నేపథ్యంలో కీను రీవ్స్, యూనిట్ ఇతర సభ్యులు ఈ వెబ్ సిరీస్ గురించి వివరాలు వెల్లడిస్తూ..
జాన్ విక్ ప్రాంచైజీలో వచ్చిన మూడు సిరీస్‌ల కంటే.. ఇది చాలా కఠినమైన సిరీస్ అని అన్నారు. వెబ్ సిరీస్ సందర్భంగా చాలా కొత్త విషయాలు నేర్చుకొన్నాను. నాన్ ఛాక్‌తో ఫెర్ఫార్మెన్స్ చేయడం కష్టంగా అనిపించింది. ఆ విద్యను ఈ సిరీస్ కోసం నేర్చుకొన్నాను. దర్శకుడు చెప్పిన చాలా విషయాలు నాకు ఆశ్చర్యం కలిగించాయి అని కీను రీవ్ అన్నారు. 2019లో వచ్చిన జాన్ విక్: 3 సిరీస్‌కు కొనసాగింపుగా ఉంటుందని, ఈ సిరిస్ అభిమానులకు కొత్త అనుభూతిని ఇస్తుంది అని యూనిట్ వర్గాలు వెల్లడించాయి.

జాన్ విక్: ఛాప్టర్ 4 విషయానికి వస్తే.. పాత కొత్త నటులతో మేళవింపుతో కూర్పు జరిగింది. ఈ చిత్రంలో డానీ యెన్, లారెన్స్ ఫిష్‌బర్న్, రినా సవాయామా, మ్యాక్ షేన్, షామీర్ అండర్సన్ తదితరులు నటించారు. జాన్ విక్: ఛాప్టర్ 4 చిత్రాన్ని మార్చి 24వ తేదీన ఇండియాలో లైన్స్‌గేట్, పీవీఆర్ పిక్చర్స్ థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











