ఆమె నాకు స్నేహితురాలు కంటే ఎక్కవ, ఫ్యామిలీ మెంబర్ కూడా..
కైరా నైట్లీ, కారీ ముల్లిగన్ ఇద్దరూ కలసి మరలా ఓఅధ్బుతమైన చిత్రంలో నటించనున్నారు. గతంలో వీరి కాంబినేషన్ లోవచ్చినటువంటి ప్రైడ్ అండ్ ప్రిజుడిస్ సినిమా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈసందర్బంలో కారీ ముల్లిగన్ మాట్లాడుతూ ప్రస్తుతం నేను కైరా నైట్లీ కలసి నెవర్ లెట్ మి గో అనే చిత్రంలో నటించడం జరుగుతుంది. కైరా నైట్లీతో స్క్రీన్ స్పేస్ పంచుకుంటున్న ప్రతిసారి నాకు చాలా ఆనందంగా ఉంటుంది. దానికి కారణం కైరా నైట్లీ స్క్రీన్ మీద చాలా బాగా సహాకరిస్తుంది.
తనతో కలసి ఈసినిమాలో నటిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మేము ఇద్దరం అక్కా చెల్లెలు లాగా చాలా సరదగా కలసిపోతాం. ఇంకా చెప్పాలంటే ఒక ఫ్యామలీగా కలసిపోతాం. అలాంటి సంబంధం మరలా ఈసినిమాలో కోనసాగుతున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. చివరగా కారీ ముల్లిగన్ నేను ఎప్పుడైనా కైరా నైట్లీకి ఫోన్ చేసి ట్రబుల్ లోఉన్నానంటే వెంటనే వచ్చి నాకు తను వచ్చి నాకు చాలా ధైర్యాన్ని చెబుతుంది. బ్రోకన్ హార్ట్ సినిమా చేసేటప్పుడు నేను చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు తను వెంటనే వాటిని తీర్చిందని తన పాత జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు.


Click it and Unblock the Notifications











