ఐరన్ మ్యాన్ 2 యాక్టర్‌ను అరెస్ట్ చేసిన ఎఫ్‌బీఐ.. యూఎస్‌లో కరోనావైరస్ డ్రగ్ స్కామ్

కరోనావైరస్ పేరు‌తో చీటింగ్ పాల్పడుతున్న హాలీవుడ్ నటుడు, ఐరన్ మ్యాన్ 2 ఫేమ్ కీత్ లారెన్స్ మిడిల్ బ్రూక్‌ను ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) అరెస్ట్ చేసింది. ప్రాణాంతక కరోనావైరస్ వ్యాధిని నయం చేసే ట్యాబ్లెట్స్ అమ్మకాలు చేపట్టిన ఈ నటుడిపై కొందరు ఫిర్యాదు చేయడంతో ఎఫ్‌బీఐ రంగంలోకి దిగింది. కీత్ చేస్తున్న బండారాన్ని పరిశీలించిన అనంతరం చీటింగ్ పాల్పడుతున్నారనే ఆరోపణలపై పోలీసులు అరెస్ట్ చేశారు. వివారాల్లోకి వెళితే..

కరోనావైరస్ బాధితుల చీటింగ్

కరోనావైరస్ బాధితుల చీటింగ్

కొవిడ్ 19 ఇన్‌ఫెక్షన్‌ను అరికట్టే.. వైరస్‌ను క్యూర్ చేసే ట్యాబ్లెట్స్ అంటూ మోసానికి పాల్పడటంతో భాధితులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అనంతరం దర్యాప్తు చేపట్టిన అధికారులు పక్కాగా వలపన్ని పట్టుకొన్నారు. క్వాంటమ్ ప్రివెన్షన్ సీవీ ఇన్‌కార్పోరేషన్ కంపెనీ పెట్టుబడులను పెంచేందుకు కుట్ర పన్నినట్టు ఎఫ్‌బీఐ అధికారులు తమ దర్యాప్తులో గుర్తించారు అని హాలీవుడ్ మీడియా కథనంలో పేర్కొన్నది.

రంగంలోకి ఎఫ్‌బీఐ

రంగంలోకి ఎఫ్‌బీఐ

కీత్ డ్రగ్ కంపెనీ ఇన్వెస్టర్ పేరుతో ఓవ్యక్తి టాబ్లెట్స్‌ ప్యాక్‌ను డెలివరీ చేసేందుకు ప్రయత్నిస్తుండగా ఎఫ్‌బీఐ అధికారులు పట్టుకొన్నారు. అతడిని విచారించగా.. ఈ ముఠా వెనుక హాలీవుడ్ నటుడు కీత్ ఉన్నారనే విషయం బయటకు వచ్చింది. పక్కా ఆధారాలతో కీత్ నివాసాలు, కార్యాలయాలపై దాడి చేసిన అధికారులు మార్చి 25న లాస్ ఏంజెలెస్‌లో అరెస్ట్ చేశారు.

వివాదంలోకి మ్యాజిక్ జాన్సన్

వివాదంలోకి మ్యాజిక్ జాన్సన్

విచారణలో ప్రముఖ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు, మ్యాజిక్ జాన్సన్‌ను ఈ కుంభకోణంలోకి లాగేందుకు ప్రయత్నించారు. తమ కంపెనీలో మ్యాజిక్ జాన్సన్ డైరెక్టర్ అని తప్పుడు సమాచారం అందించేందుకు ప్రయత్నించారు. అయితే కీత్ లారెన్స్ మిడిల్‌బ్రూక్ కంపెనీతో తమకు సంబంధం లేదని మ్యాజిక్ జాన్సన్ వివరణ ఇవ్వడంతో ఎఫ్‌బీఐ సంత‌ృప్తి చెందింది.

Recommended Video

Akshay Kumar's First Look From Laxmmi B**b Is Out || Filmibeat Telugu
నకిలీ డగ్ర్స్ బెడద అంటూ..

నకిలీ డగ్ర్స్ బెడద అంటూ..

అమెరికాను అతలాకుతలం చేస్తున్న కరోనావైరస్ నేపథ్యంలో బోగస్ కంపెనీలు, నకిలీ డ్రగ్స్‌తో కొందరు బాధితులను చీటింగ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని యూఎస్ అటార్నీ నిక్ హన్నా కొద్దిరోజులుగా అధికారులను అప్రమత్తం చేస్తున్నది. ఈ క్రమంలోనే హాలీవుడ్ నటుడి అరెస్ట్ స్థానికంగా సంచలనం రేపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X