బాయ్ ప్రెండ్ కానీ, పెళ్లి ఆలోచన ఇప్పుడు లేదు
లండన్: ప్రముఖ మోడల్ కెల్లీ బ్రూక్ బాయ్ ప్రెండ్ రగ్బీ ప్లేయర్ ధామ్ ఈవెన్స్ కెల్లీని పెళ్లి చేసుకునే విషయమై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని అన్నాడు. అందుకు కారణం ధామ్ ఈవెన్స్ వాళ్ల అమ్మ కెల్లీ గురించి నెగిటివ్‌గా చెప్పడమేనని అంటున్నారు. వివరాల్లోకి వెళితే 26 సంవత్సరాలు వయసు కలిగిన ధామ్ ఈవెన్స్, 32 సంవత్సరాల వయసు కలిగిన కెల్లీ బ్రూక్ ఇద్దరూ గత కొంత కాలంగా ప్రేమించుకుంటూ, డేటింగ్ చేసుకుంటున్న విషయం తెలిసిందే.
ఈ సందర్బంలో ఇటీవల ఓ ఇంటర్యూలో మీ ఇద్దరి పెళ్లిపై స్పందించమనగా ప్రస్తుతానికి కెల్లీని పెళ్లి చేసుకునే ఆలోచనలో లేనని అన్నారు. అందుకు కారణం మా అమ్మ నీకు పెళ్లి చేసుకొవడానికి చాలా టైమ్ ఉంది, ప్రస్తుతం లైఫ్‌లో సెటిల్ అవ్వు, ఆ తర్వాత నిదానంగా పెళ్లి చేసుకొవచ్చని అన్నారని అన్నారు. ఇక్కడ మీ అందరికి ఇంకొక విషయం చెప్పాలి. కెల్లీ నాకంటే ఆరు సంవత్సరాలు వయుసలో పెద్దది. ఐతే మేమిద్దరం పెళ్లి చేసుకొవడానికి వయసుతో సంబంధం లేదని అన్నాడు.
ఆడవారు వయసులో ఎక్కవైతే సాధారణంగా చాలా మంది వారిని తిరస్కరించడం జరుగుతుంది. కానీ నాకు అటువంటి ఇబ్బంది లేదు. నిజం చెప్పాలంటే మగవారి కంటే ఆడవారే ఎక్కువ సంవత్సరాలు జీవిస్తారని మా అమ్మ అప్పుడప్పుడు నాతో అంటుంది. ప్రస్తుతానికి మా ఇద్దరి మద్య ఎటువంటి ఎంగేజ్ మెంట్ కానీ, పెళ్లి గానీ జరగలేదని స్పష్టం చేశాడు.


Click it and Unblock the Notifications











