ఉదయం 6 గంటలు.. మేకప్ లేకుండా ఎయిర్ పోర్ట్‌లో..
ఉదయం 6 గంటలు. బెల్‌ఫాస్ట్ ఎయిర్ పోర్ట్. చాలా మంది కెమెరా మెన్‌లు కెమెరాలు పట్టుకోని అక్కడ పడిగాపులు కాస్తున్నారు. అందుకు కారణం హాలీవుడ్ స్టార్ హీరోయిన్ మరి కొద్ది సేపట్లో అక్కడి విమానంలో ఎక్కేందుకు రావడమే. ఐతే ఇక్కడ అందరూ ఆమె కోసం మాత్రం ఎదురు చూస్తుంది ఇంకో విషయం గురించి. సాధారణంగా సెలబ్రిటీలు ఏ సమయంలోనైనా మేకప్ లేకుండా ఎక్కడకి బయటకు వెళ్లరు అన్న విషయం అందరికి తెలిసిందే.
కెమెరా మెన్స్ వేచి చూస్తున్న ఆ స్టార్ హీరోయిన్ కెల్లీ బ్రూక్. అందరు కూడా కెల్లీ బ్లూక్ మేకప్‌తో వస్తుందని భావించారు. ఐతే అనుకున్నదొకటి, అయినది ఒకటి అన్న రీతిలో కెల్లీ బ్రూక్ ముఖం మీద ఎటువంటి మేకప్ లేకుండా సాధారణంగా అక్కడి రావడంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యచకితులైనారు. కెల్లీ బ్రూక్ మేకప్ లేకుండా కూడా చాలా అందంగా కనిపించడంతో అక్కడున్న కెమెరా మెన్స్ వారి కెమెరాలతో కెల్లీ బ్రూక్‌ని క్లిక్ మనిపించారు.
32 సంవత్సరాలు వయసు కలిగిన కెల్లీ బ్రూక్ మెరూన్ కలర్ ట్రౌజర్‌తో పాటు, బ్లాక్ జాకెట్, బ్లాక్ బూట్స్, గ్రే కలర్ స్కాప్ ధరించి అందమైన నవ్వుతో అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇంతకీ కెల్లీ బ్రూక్ తెల్లవారుజామున 6 గంటలకు బెల్ ఫాస్ట్ ఎయిర్ పోర్ట్‌కి రావడానికి కారణం.. తాను ప్రస్తుతం నటిస్తున్న 'ద మూవీ' షూటింగ్ ఐర్లాండ్‌లో జరుగుతుండడంతో అక్కడికి వెల్లడం కోసం ఎయిర్ పోర్ట్‌కి వచ్చారు.
గతంలో కూడా కెల్లీ బ్రూక్ ఫిరానా 3డి లాంటి పలు చిత్రాల్లో నటించడం జరిగింది. 2009వ సంవత్సరంలో క్యాలెండర్ గర్ల్స్ స్టేజి షోలో కూడా పాల్గోన్నారు.


Click it and Unblock the Notifications











