ఇన్నాళ్లకు తన ప్రెగ్నెన్సీ విషయాన్నిబయట పెట్టిన మోడల్
ప్రముఖ మోడల్ కెల్లీ బ్రూక్ తను ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు సరైన సూచనలు తీసుకొకపోవడం వల్ల తన బిడ్డను కొల్పోయిన విషయాన్ని ఇన్నాళ్లకు వెల్లడించారు. ఈ సందర్బంలో కెల్లీ బ్రూక్ మాట్లాడుతూ నా జీవితంలో అత్యంత దుర్బరమైన భాదను అనుభవించిన రోజులుగా వాటిని అభివర్ణించారు. 31 సంవత్సరాలు వయుసు కలిగినటువంటి కెల్లీ బ్రూక్ తన బాయ్ ప్రెండ్ రగ్బీ ప్లేయర్ ధామ్ ఇవాన్స్ ద్వారా ప్రెగ్నెన్సీ ధరించారు. తనకు పుట్టబోయేటటువంటి బేబిగర్ల్‌ని మిస్ క్యారేజి వల్ల కొల్పోయానని తెలిపింది. ఆసమయంలో నేను ఐదు నెలలు ప్రెగ్నెంట్‌నని వెల్లడించారు.
ఆ భాదతో కెల్లీ బ్రూక్ కెంట్‌లో ఉన్నటువంటి తన ఇంట్లో కొన్ని నెలలుపాటు బాధను అనుభవిస్తూ అక్కడే ఒంటరిగా గడిపానని తెలిపారు. ఆ తర్వాత కాలంలో నేను మరలా మామూలు మనిషిని కావడానికి ధామ్ ఇవాన్స్ ఇచ్చినటువంటి గైడెన్స్ ఎంతగానో ఉపయోగపడింది. జీవితంలో అనేది ఓ ప్రయాణం లాంటిది. అందులో మనం కొన్ని ఒడిడుదుకులను ఎదుర్కొవాల్సి వస్తుందని తెలిపింది. మనం జీవితంలో కొన్ని సంఘటనలు మనల్ని చాలా భాదకు గురి చేస్తాయి. అవే మరికొన్ని సంఘటనలు మనల్ని ఎంతో ఆనందానికి గురిచేస్తాయని అన్నారు. ఇలా మీకు నేను చెబుతుంటే నేనో ఫిలాసఫర్ లాగా మారిపోయానని అనుకుంటున్నారు.
ఇది ఇలా ఉంటే ఇటీవల ఓ ప్రముఖ వెబ్‌సైట్‌లో సెలబ్రిటీలలో ఎవరిది బెస్ట్ బికనీ బాడీ అంటూ ఓ పోల్‌ని నిర్వహించడం జరిగింది. ఈ పోల్‌లో హాలీవుడ్లో ఉన్న ప్రముఖ హీరోయిన్స్ పేర్లు ఉంచడం జరిగింది. ఈ పోల్‌కి స్పందించిన యావత్ హాలీవుడ్ జనాభా 31 సంవత్సరాల వయసు కలిగినటువంటి కెల్లీ బ్రూక్ కే బెస్ట్ బికినీ బాడీ ఉందంటూ అత్యధిక ఓట్లు వేసి నెంబర్ వన్ స్దానాన్ని కట్టబెట్టారు.


Click it and Unblock the Notifications











