బాయ్ ప్రెండ్‌తో కలసి బాక్సింగ్ పాఠాలు
కెల్లీ బ్రూక్ స్వస్దలం ఇంగ్లాండ్. మోడలింగ్ రంగంలో అత్యున్నత శిఖరాలకు చేరుకున్న ప్రముఖ మోడల్. 31 సంవత్సరాల వయసు కలిగిన కెల్లీ బ్రూక్ బాయ్ ప్రెండ్ రగ్బీ ప్లేయర్ ధామ్ నుండి ప్రేమపాఠాలతో పాటు, తన శరీర సౌష్టవాన్ని అందంగా తీర్చిదిద్దుకునేందుకు గాను బాక్సింగ్ పాఠాలను కూడా నేర్చుకుంటుందంట. ఈ సందర్బంలో కెల్లీ బ్రూక్ మాట్లాడుతూ బాక్సింగ్ పాఠాలు నేర్చుకొవడం వల్ల శరీరం గట్టి పడడమే కాకుండా, మంచి షేప్‌ని సొంతం చేసుకుంటుంది.
దాంతో నా బైక్‌ని నేనే రైడ్ చేసుకొవడం, స్విమ్మింగ్ పూల్‌లో ఎవరి సహాయం లేకుండా స్విమ్మింగ్ కూడా చేస్తున్నానని ఎంతో ఆనందంతో చెబుతున్నారు. బికనీ షేప్ బాడీ అనేది ఐడియల్ ఫిగర్‌కి శుభసూచకం. ఇటీవల ఓ ప్రముఖ వెబ్‌సైట్‌లో సెలబ్రిటీలలో ఎవరిది బెస్ట్ బికనీ బాడీ అంటూ ఓ పోల్‌ని నిర్వహించడం జరిగింది. ఈ పోల్‌లో హాలీవుడ్లో ఉన్న ప్రముఖ హీరోయిన్స్ పేర్లు ఉంచడం జరిగింది. ఈ పోల్‌కి స్పందించిన యావత్ హాలీవుడ్ జనాభా 31 సంవత్సరాల వయసు కలిగినటువంటి కెల్లీ బ్రూక్ కే బెస్ట్ బికినీ బాడీ ఉందంటూ అత్యధిక ఓట్లు వేసి నెంబర్ వన్ స్దానాన్ని కట్టబెట్టారు.
రెండవ స్దానంలో ఇటీవలే తన భర్త మార్క్ ఆంటోనీ నుండి విడాకులు తీసుకున్న సింగర్ జెన్నిఫర లోపెజ్ నిలిచింది. రాయల్ వెడ్డింగ్‌లో అందరి దృష్టిని తనవైపు మరల్చుకున్న పిప్పా మిడిల్టన్ మూడవ స్దానంలో నిలిచారు.


Click it and Unblock the Notifications











