తెర ముందు మోడల్.. తెర వెనుక సింగర్

By Nageswara Rao

లండన్: 'తానొకటి తలిస్తే దేవుడు మరోకటి తలిచాడన్నట్టు'... ఆస్టేలియా సూపర్ మోడల్ మిరందా కెర్‌‌కి పాటలు పాడడం అంటే చాలా ఇష్టం అయినప్పటికీ.. దేవుడు ఆమెను ప్రపంచంలో ఓ సూపర్ మోడల్‌గా తీర్చిదిద్దాడు. ఒకసారి సెలబ్రిటీ అయిన తర్వాత వారి కోరికలను బయటకు రానివ్వరు. అదే విధంగా సూపర్ మోడల్ మిరందా కెర్‌‌‌కి సింగింగ్ అంటే చాలా ఇష్టం అంట. పాప్ స్టార్ కావాలని సొంతంగా కొన్ని ట్రాక్స్‌ని రికార్డు చేసుకోని మరీ వినడం తనకు నచ్చిన అలవాటు.

ఐతే తాను పాడిన పాటలను పబ్లిక్‌కు ఇంత వరకు వినిపించ లేదంట. నేను కొన్ని సాంగ్స్‌ని రికార్డ్ చేశాను. ఈ విషయం గురించి ఎవరికీ తెలియదు. నాకు పాడడం అంటే చాలా ఇష్టమని అన్నారు. కానీ నేను సింగింగ్‌ వైపుకి కెరియర్‌ని ప్రారంభించాలని అనుకున్న సమయంలో అప్పటికే మోడలింగ్‌లో నాకంటూ ఓ ప్రత్యేకమైన స్దానం సంపాదించుకోవడంతో నా కుటుంబం కోసం మోడలింగ్‌పై దృష్టిని సారించానని అన్నారు.

మిరందా కెర్, ఇంగ్లీషు సూపర్ హీరో ఓర్మాల్డ్ బ్లూమ్ ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరి ప్రేమకు ప్రతిరూపంగా 'ప్లైన్' అనే బాబుకి మిరందా కెర్ జన్మనిచ్చింది. ఇటీవల న్యూయార్క్‌లో నిన్న జరిగిన 'విక్టోరియా సీక్రెట్ ప్యాషన్ షో'లో రూ 12.75 కొట్లు విలువ కలిగిన బ్రా ధరించి క్యాట్ వాక్ చేశారు. మిరందా కెర్ ధరించిన బ్రాలో 3,400 రత్నాలు, 142 క్యారెట్లు విలువ కలిగిన తెలుపు, పసుపు వజ్రాలు, ముత్యాలతో పాటు 18 క్యారెట్లు విలువ కలిగిన తెలుపు, పసుపు బంగరాన్ని బ్రాలో నిక్షిప్తం చేయడం జరిగింది.

ఈ బ్రా ధరించి ప్రదర్శించిన తర్వాత మిరందా కెర్ మాట్లాడుతూ ఇంతటి ఖరీదైన విలువ కలిగిన 'బ్రా'ని ధరించడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X