ఆ 'ఆడ-మగ' కాని వాడివల్లే ఆమె ఇలా తయారయింది...!!

By Kuladeep

ప్రముఖ బ్రిటీష్ మోడల్ క్యాటీ ప్రైజ్ తన బాయ్ ఫ్రెండ్ అలెక్స్ రెయిడ్ నుండీ విడిపోతున్నానని చెప్పి, ఆ తర్వాత తన మాజీ భర్త పీటర్ తో సహవాసానికి ప్రయత్నించి అతను కాదనటంతో తిరిగి క్రాస్ డ్రెస్సర్ అలెక్స్ తో కలసి సహజీవనం సాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై ఆమె మీద సర్వత్రా విమర్శవలు ఎదురవుతున్నాయి. లండన్ లో నిర్వహించిన 2009వ సంవత్సర విలన్ ఎవరు అనే పోల్ లో క్యాటీ ప్రథమ స్థానంలో నిలిచి ఆమె మాజీ భర్త పీటర్ 2009వ సంవత్సర హీరోగా ఎంపికయ్యాడంటే ప్రజలు ఆమెను ఎంతగా ద్వేషిస్తున్నారో అర్థమవుతుంది. ఒక విధంగా క్యాటీ మీద కోపం పీటర్ కు అనుకూలంగా ఓట్ చేసేలా ప్రభావితం చేసింది అనడంలో అతిశయోక్తి లేదు.

కాగా ఇప్పుడు ఆమెను స్నేహితురాలు కెర్రీ కటోనా క్యాటీ మీద విరుచుకుపడుతోంది. తన భర్త పీటర్ చాలా మంచి వాడని అలాంటి వాన్ని వదిలెయ్యడమే కాకుండా, ఆమె ఓ క్రాస్ డ్రెస్సర్ అయిన అలెక్స్ తో కలసి వుండటం, ఆ తర్వాత అతని నుండీ కూడా విడిపోతానని ప్రకటించి తిరిగి కలసిపోవడం, అతనితో రహస్య సంబంధాన్ని కొనసాగిస్తుండటం, ఇటీవలే తన పిల్లల ముందు అలెక్స్ తో కలిసి న్యూ ఇయర్ మందు పార్టీ చేసుకోవడం చూస్తుంటే అసలు క్యాటీ అంటేనే అసహ్యం వేస్తోందని, అయినా దీనంతటికీ కారణం ఆడ మగ కాని ఆ అలెక్సే అని తీవ్రస్థాయిలో మండిపడిందట. ఇవన్నీ చూస్తుంటే క్యాటీ కి బ్యాడ్ పబ్లిసిటీతో ఫేమస్ అవడం ఇష్టమనే అభిప్రాయం కలుగుతోందని ఆమె అభిప్రాయపడింది. ఇకనైనా ఆమె తన వైఖరిని మార్చుకుంటుందని ఆమె ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X