ఆ రాత్రి నా జీవితంలో మరచిపోలేని రోజు..!
కెర్రి కటోన తన ముఫ్పైవ పుట్టిన రోజుని ఎంతో ఘనంగా జరుపుకున్నారు. కెర్రి కటోన హాలీవుడ్ మ్యాగజైన్ మంచి కాలమిస్ట్. అంతేకాకుండా తన జీవితం గురించి ఆటో బయోగ్రఫీ రాసుకున్నారు. సెప్టంబర్ 6న ఈమె పుట్టినరోజు. ఈమెకు ఈ పుట్టినరోజు ఎంతో ప్రాముఖ్యతను తెచ్చిపెట్టిందని తాను వెల్లడించారు. ఆరోజు రాత్రి తన జీవితంలో ఎన్నడూ లేనంత విధంగా ఆనందాన్నిఅనుభవించానని, దానికి కారణం తన 30వపుట్టినరోజుని ఎంతో ఘనంగా మాంసం, మందులతో ఒక చిన్న గుడిసెలో జరుపుకున్నానని వివరించారు.
ఈ పార్టిని శనివారం వెస్ట్ ససెక్స్ లోని మార్కు లో ఏర్పాటు చేయడం జరిగినది. ఈ పుట్టినరోజుని తన భర్తతో చేసుకోవడం తనకు చాలా ఆనందంగా వుందని అన్నారు. ఈ రోజుని నా జీవితంలో మరచిపోలేని రోజుగా భావిస్తున్నాను అని అన్నారు. అంతేకాకుండా తన పుట్టినరోజు రాత్రి తనకు బాగా ఇష్టమైన సిన్జానో బయాన్కో కాక్ టైల్స్ ని తాగేసి పార్టీకి మంచి అందం తీసుకోనివచ్చారని ఆమె వెల్లడించారు. ఈ రాత్రి నా జీవితంలో మరచిపోలేని రోజుని ఆమె వెల్లడించారు.


Click it and Unblock the Notifications











