అభిమానులతో ప్రేమను పంచుకోవాలన్న తపనే ఆరియాలిటీ షో కికారణం
హాలీవుడ్ రియాలిటీ టివి స్టార్ కోల్ కర్దాషియాన్ ఆమె భర్త లామర్ ఓడమ్ ఇద్దరూ కలసి ఓసరికొత్త రియాలిటీ షో చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వివరించారు. దీనికి సంబందించినటువంటి షో ప్రోడ్యూసర్ కూడా కన్ ఫర్మ్ చేయడంతో ఇక వీరు ఈసంవత్సరం మొదటి లోనే ఈషో మొదలు పెట్టాలని ఆలోచనలో ఉన్నారు. ఈసందర్బంలో షో ప్రోడ్యూసర్ రేయన్ తన ట్విట్టర్ పేజిలో తానే స్వయంగా అధికారకంగా చెబుతున్నట్లు కర్దాషియాన్ కొత్త షో 'కోల్ అండ్ లామర్' త్వరలో ప్రారంభం కానుందని ట్వీట్ చేశారు.
దీనికి ప్రతిగా స్పందించినటువంటి కర్దాషియాన్ తన ఆనందాన్ని ప్రోడ్యూసర్ రేయన్ తోపంచుకున్నారు. అటు తర్వాత కర్దాషియాన్ ఈ న్యూస్ కిఇచ్చినటువంటి ఇంటర్యూలో మాట్లాడుతూ మాకు ఇలాంటి గోప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. మాకు ఈఅవకాశం రావడం చాలా ఆనందంగా ఉందని వారు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇది మాత్రమే కాకుండా మాఇద్దరి మద్యా ఉన్నటువంటి బాండింగ్ కాని, మాఇద్దరి మద్యా ఉన్నటువంటి ప్రేమను మాఅభిమానులతో పంచుకోవడానికి చూపించేటటువంటి ఉత్సాహామే ఈరియాలిటీ షో ప్రారంభించడానికి తొలిఅడుగు అనినేను అనుకుంటున్నానని కర్దాషియాన్ అన్నారు.


Click it and Unblock the Notifications











