గర్భవతిగా మారిన నటి.. ప్రియుడు కాదు.. ఇంకెవరకు మోసం చేశారు!

ప్రముఖ హాలీవుడ్ నటి, మోడల్ అయిన ఖోలే కర్దాషియన్ గురించి సంచలన వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమె గర్భవతి అంటూ ప్రచారం జరుగుతోంది. ప్రముఖ బాస్కెట్ బాల్ ఆటగాడు లామర్ ని ఖోలే 2009లో వివాహం చేసుకుంది. 2016 వరకు కలసి జీవించిన వీరిద్దరూ విభేదాలతో విడిపోయారు. ఆ తర్వాత ఖోలే కర్దాషియన్ ట్రిస్టన్ థామ్సన్ అనే బాస్కెట్ బాల్ ఆటగాడితో డేటింగ్ మొదలుపెట్టింది. థామ్సన్ ఖోలేని మోసం చేశాడంటూ వార్తలు వస్తున్నాయి.

మోసం చేసిన థామ్సన్

మోసం చేసిన థామ్సన్

కొన్ని నెలల క్రితం వరకు ఖోలే, థామ్సన్ మధ్య రిలేషన్ కొనసాగింది. ఆ తర్వాత వీరిద్దరూ విడిపోయారంటూ వార్తలు వచ్చాయి. సరిగ్గా ఇప్పుడే ఖోలే గర్భవతి అని వార్తలు రావడంతో.. థామ్సన్ ఆమెని మోసం చేసి వదిలేసాడంటూ వార్తలు వస్తున్నాయి. థామ్సన్ ప్రస్తుతం జోర్డాన్ వుడ్స్ అనే మోడల్ తో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఖోలేతో రిలేషన్‌లో ఉండగానే జోర్డాన్‌తో థామ్సన్ ఎఫైర్ ప్రారంభించాడని, తనని మోసం చేయడం వల్లే ఖోలే అతడి నుంచి విడిపోయిందనేది ఈ వార్తలు సారాంశం.

ప్రియుడు కాదు

ప్రియుడు కాదు

థామ్సన్ గురించి వస్తున్న ఈ వార్తలన్నీ అవాస్తవం అని హాలీవుడ్ మీడియా పేర్కొంటోంది. చాలా రోజుల క్రితమే వీరిద్దరూ విడిపోయారట. ఖోలే, థామ్సన్ విడిపోవడానికి జోర్డాన్ కారణం కాదని అంటున్నారు. మరి ఖోలే గర్భానికి కారణం ఎవరనే అనుమానాలు తలెత్తుతున్నాయి. థామ్సన్ తో విడిపోయాక ఖోలే ఇంకెవరితో అయినా రిలేషన్ పెట్టుకుందా అనే వార్తలు వస్తున్నాయి. దీని గురించి క్లారిటీ లేదు కానీ.. ఖోలే మాత్రం సింగిల్ మదర్ గా ఉండేందుకు డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. బిడ్డకు జన్మనివ్వాలని ఖోలే భావిస్తోంది.

ఏర్పాట్లు చేసుకుంటోంది

ఏర్పాట్లు చేసుకుంటోంది

సింగిల్ మదర్ గా ఉండేదుకు ఖోలే ఏర్పాట్లు చేసుకుంటోందట. ప్రస్తుతానికి ఈ గర్భం గురించి తెలియకుండా కవర్ చేసుకునేందుకు ప్రయత్నిస్తోందని అంటున్నారు. ఖోలే కర్దాషియన్ ప్రస్తుతం లాస్ వేగాస్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ పార్టీలో కూడా కనిపించిందట. ఆమె గర్భవతి అయితే పార్టీలో ఆల్కహాల్ ఎందుకు సేవిస్తుందని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

పెద్ద ఫ్యామిలీ

పెద్ద ఫ్యామిలీ

ఖోలే కర్దాషియన్ కు పెద్ద ఫ్యామిలీ అంటే ఇష్టం అట. అందుకే ఎక్కువ పిల్లలకు జన్మనిచ్చేందుకు ఖోలే ఇష్టపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సింగిల్ మదర్ గా అయినా తన పిల్లలని తాను పోషించుకోవాలని ఖోలే భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఖోలే కర్దాషియన్ సోదరి కిమ్ కర్దాషియన్ ఇప్పటికే ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X