భర్తకు విడాకులు.. ప్రియుడు చీటింగ్.. రెండోసారి గర్బవతిగా హాలీవుడ్ నటి
హాలీవుడ్‌లో మోడల్, సెలబ్రిటీ, నటి ఖోల్ కర్దాషియాన్ రెండోసారి తల్లి కాబోతున్నదనే వార్తలు హాలీవుడ్‌లో షికారు చేస్తున్నాయి. ఇప్పటికే భర్తకు విడాకులిచ్చిన ఆమె బాయ్‌ఫ్రెండ్‌తో సహజీవనం చేస్తున్నది. అయితే బాయ్‌ఫ్రెండ్ ట్రిస్తాన్ థాంప్సన్‌తో కూడా విడిపోయిందనే వార్తల మధ్య ఆమె గర్భం దాల్చడం సినీ వర్గాల్లో చర్చకు దారి తీసింది. ఇప్పుడు రెండో బిడ్డకు తండ్రి ఎవరనే విషయం ఆసక్తిగా మారింది. కర్దాషియాన్ గురించి మరిన్ని వివరాలు..

సహజీవనంతో గర్బవతిగా
గతంలో భర్త లామర్ ఓడమ్‌తో విడిపోయిన తర్వాత ట్రిస్టన్ థాంప్సన్‌తో సహజీవనం చేసింది. ఆయన ద్వారా ఆమెకు ట్రూ కర్దాషియన్ అనే బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ట్రిస్టన్‌తో విభేదాలు నెలకొనడంతో కర్దాషియాన్ విడిపోయినట్టు వార్తలు వచ్చాయి. అయితే అధికారికంగా తమ రిలేషన్‌పై వారిద్దరూ ఎలాంటి ప్రకటన చేయకపోవడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. ఈ క్రమంలో ఆమె గర్బం దాల్చడం జరిగింది.

ప్రెగ్నెన్సీకి సంకేతిమిస్తూ..
అయితే తన గర్బం దాల్చినట్టు ఎక్కడా ప్రకటన చేయకపోగా.. పింక్ కలర్‌తో కూడిన బొమ్మలను ఇటీవల రెగ్యులర్‌గా పోస్టు చేస్తున్నది. అలా చేయడాన్ని బట్టి ఆడపిల్లకు జన్మనివ్వబోతున్నట్టు సూచించడమేనని స్నేహితులు, సన్నిహితులు భావిస్తున్నారు. అంతేకాకుండా ఆమె తల్లి ఆమెకు కొంత పౌష్టిక ఆహారం పంపడంతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి.

ఫ్రెండ్స్ విషెస్, గిప్టులు
ఇక కర్దాషియాన్‌కు స్నేహితులు కుప్పలు తెప్పలుగా బహుమతులు పంపుతున్నట్టు తెలిసింది. ఇక ఆన్‌లైన్‌లో, సోషల్ మీడియాలో బెలూన్లు, పింక్ కలర్స్‌లో గిఫ్టులు పంపడంతో ఆమె గర్భవతి అనే విషయం పక్కాగా నిర్ధారణకు వచ్చింది. ఇక ప్రత్యేకంగా అమ్మ అని సూచించే గిప్టులు పంపడంతో ప్రెగ్నెంట్ అనేది గ్యారెంటిగా ధృవీకరిస్తున్నారు.
Recommended Video

ప్రియుడు చీటింగ్..
ఇక మొదటి నుంచి కర్దాషియాన్, ట్రిస్టన్ మధ్య రిలేషన్ వివాదాస్పదంగానే కొనసాగింది. ఇటీవల ఆమెను ట్రిస్టన్ చీటింగ్ చేశాడని మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దాంతో ఆమె ఆయనకు దూరంగా ఉంటూ వస్తున్నది. ఇటీవల కాలంలో ట్రిస్టన్, కర్దాషియాన్ కలిసి కనిపించిన దాఖలాలు లేవు. దాంతో వారిద్దరి మధ్య బంధం తెగినట్లేనని సినీ వర్గాలు ధృవీకరిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











